Women's T20 World Cup 2023 Schedule: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 2023 ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. మొట్టమొదటి మహిళల టీ20 వరల్డ్ కప్ 2009లో జరిగింది. ప్రస్తుతం జరగబోయేది 8వ ఎడిషన్. ఈ సీజన్ లో ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికా శ్రీలంకతో తలపడనుంది. ఫిబ్రవరి 12న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ తో టోర్నీని ప్రారంభించనుంది.
ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ముఖచిత్రం
- ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరుగుతుంది.
- 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు.
- గ్రూప్- ఏ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్- బీలో ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్ ఐర్లాండ్ ఉన్నాయి.
- తమ తమ గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. సెమీఫైనల్ విజేతలు ఫైనల్ కప్ కోసం తలపడతాయి.
- ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26న న్యూలాండ్స్ లోని కేప్ టౌన్ వేదికగా జరగనుంది.
ఎక్కడ చూడాలి
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఆస్ట్రేలియా ఆధిపత్యం
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజయవంతమైన జట్టుగా ఉంది. ఆసీస్ అత్యధికంగా 5 సార్లు కప్ ను గెలుచుకుంది. 2020లో జరిగిన ఫైనల్ లో భారత్ ను ఓడించి కప్ ను అందుకుంది. అంతకుముందు 2012, 2012, 2014, 2018లో ఆ జట్టు ప్రపంచకప్ ను ముద్దాడింది.
** సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచుకు రిజర్వే డేలు ఉన్నాయి. ఫిబ్రవరి 24, 25 తేదీలు సెమీఫైనల్స్ కు, ఫిబ్రవరి 27 ఫైనల్స్ కు రిజర్వ్ డేలు.
టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.
రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్
వరల్డ్ కప్‌లో భారత షెడ్యూల్..
ఫిబ్రవరి 12న భారత్ vs పాకిస్థాన్
ఫిబ్రవరి 15న భారత్ vs వెస్టిండీస్
ఫిబ్రవరి 18న భారత్ vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 20న భారత్ vs ఐర్లాండ్