ICC ODI World Cup 2023: పదేండ్ల తర్వాత భారత్ వేదికగా జరుగబోతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇదివరకే నేరుగా అర్హత సాధించిన 8 జట్లతో పాటుగా వాటికి జతకలిసే రెండు జట్లేవో తేలిపోయింది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో స్కాట్లాండ్ ను ఓడించిన నెదర్లాండ్స్.. అక్టోబర్ లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఇంతకుముందే శ్రీలంక కూడా క్వాలిఫై అయిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం విడుదలైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో భారత్, ఇతర జట్లకూ క్వాలిఫయర్స్ ప్రత్యర్థులు ఖాయమయ్యారు. అక్టోబర్ ఐదు నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో అదే నెల 8న భారత్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. క్వాలిఫైయర్ జట్లు తేలిపోవడంతో భారత పూర్తి షెడ్యూల్ కింది విధంగా ఉంది.
టీమిండియా అప్డేటెడ్ షెడ్యూల్ :
- అక్టోబర్ 08 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా - చెన్నై
- అక్టోబర్ 11 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ - ఢిల్లీ
- అక్టోబర్ 15 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ - అహ్మదాబాద్
- అక్టోబర్ 19 : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ - పూణె
- అక్టోబర్ 22 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
- అక్టోబర్ 29 : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ - లక్నో
- నవంబర్ 02 : ఇండియా వర్సెస్ శ్రీలంక - ముంబై
- నవంబర్ 05 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా - కోల్కతా
- నవంబర్ 11 : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
- భారత్ ఆడబోయే మ్యాచ్ లు అన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి.
2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన చోటే (వాంఖెడే - ముంబై) టీమిండియా శ్రీలంకతో తలపడనుండటం విశేషం. ఇక భారత చివరి లీగ్ మ్యాచ్ నవంబర్ 11న నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా జరుగనుంది.
హైదరాబాద్ లో..
శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్ కప్ లో తమ బెర్తులను ఖాయం చేసుకోవడంతో హైదరాబాద్ లో ఈ జట్లు ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్ ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లకే ఆతిథ్యమిస్తుండగా అందులో రెండు క్వాలిఫయర్ టీమ్స్ తో ఉన్నవే..
1. అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
2. అక్టోబర్ 09 : న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక
3. అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్