ICC announces equal prize money for men's and women's World Cups:  మహిళల క్రికెట్(Cricket) కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు... సభ్య దేశాలకు మరింత ఉత్సాహాన్నిచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC )కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ(equal prize money) అందిస్తామని ప్రకటించింది. వచ్చే నెల జరగనున్న మహిళల టీ 20 ప్రపంచకప్ నుంచే ఈ పెంచిన ప్రైజ్ మనీ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీని సమం చేస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది చారిత్రాత్మక నిర్ణయమని పలువురు మాజీ క్రికెటర్లు కొనియాడారు. 

ఎంత పెరిగిందంటే
 ప్రపంచకప్ లలో మహిళల ప్రైజ్ మనీని పురుషుల ప్రైజ్ మనీతో సమంగా ఇస్తామన్న ఐసీసీ చారిత్రాత్మక ప్రకటనతో ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. గత ప్రపంచకప్ తో పోలిస్తే వచ్చే నెల జరగనున్న టీ 20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఏకంగా 225 శాతం పెరిగింది. టీ 20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ ఇప్పుడు రూ. 66.64 కోట్లకు పెరిగింది. ఈసారి టీ 20 ప్రపంచకప్ ను గెలిచిన జట్టుకు రూ.19.60 కోట్లు దక్కనున్నాయి. అమెరికా- వెస్టిండీస్ నిర్వహించిన పురుషుల టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ.20.52 కోట్లు దక్కాయి. ఈసారి దాదాపుగా టీ 20 ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు కూడా దాదాపుగా అదే మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. 




ఐసీసీ కీలక ప్రకట


"ఐసీసీ మహిళల టి 20 ప్రపంచ కప్ 2024 ఆరంభం వేళ కీలక నిర్ణయం తీసుకున్నాం. పురుషులకు ఇస్తున్నట్లే మహిళలకు సమానంగా ప్రైజ్ మనీ ఇస్తాం. ఇది క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి." అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. "జులై 2023లో జరిగిన ICC వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాం. 2030 షెడ్యూల్ కంటే ఏడేళ్ల ముందుగానే ICC బోర్డు... ప్రైజ్ మనీని సమం చేయాలన్న నిర్ణయాన్ని అమలు చేసి గొప్ప ముందడుగు వేసింది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంటలో ఇక ప్రైజ్ మనీ కూడా సమంగా దక్కుతంది" అని ఐసీసీ ప్రకటించింది.ప్రపంచకప్ లో ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.9 కోట్లు దక్కుతాయి. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు రూ. 5.65 కోట్లు అందుకుంటాయి. గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జట్లు 31 వేల డాలర్లు అందుకుంటాయి. 


Read Also: ఆసియాలో భారత్ ను ఆపే జట్టుందా, అయిదోసారి కప్పు మనదే



ఎప్పటినుంచంటే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్‌ అక్టోబరు 3 నుంచి 20 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉన్నా అక్కడి హింసాత్మక వాతావరణం నేపథ్యంలో దానిని యూఏఈకి తరలించారు. ఈ టోర్నమెంట్ ను మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి  మొదటి రెండు స్థానాల్లో  నిలిచిన టీమ్‌లు సెమీ ఫైనల్ కు చేరతాయి. గ్రూప్‌ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక ఉండగా గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.  ఇక భారత జట్టు  అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. దాయాది జట్లు  భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరగనుంది.