దక్షిణాఫ్రికా(South African ) విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌(Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి క్రికెట్‌ అభిమానులను షాక్‌గు గురిచేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని క్లాసెన్‌ తెలిపాడు. టెస్ట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని, తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్‌ వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్‌ ఫార్మాట్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు.


2019లో టెస్ట్‌ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన32 ఏళ్ల క్లాసెన్‌ సౌతాఫ్రికా(South Africa) తరఫున కేవలం నాలుగు టెస్ట్‌లు మాత్రమే ఆడాడు. విధ్వంసకర ఆటగాడు కావడంతో క్లాసెన్‌పై లిమిటెడ్‌ ఓవర్స్‌ ప్లేయర్‌గా ముద్ర పడింది. 4 టెస్ట్‌ల్లో క్లాసెన్‌ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు చేశాడు. వన్డే, టీ20ల్లో క్లాసెన్‌కు ఘనమైన రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 40.1 సగటున 1723 పరుగులు చేసిన క్లాసెన్‌.. 43 టీ20ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 147.6 స్ట్రయిక్‌రేట్‌తో 722 పరుగులు చేశాడు. 


2023లో క్లాసెన్‌ అరుదైన రికార్డు
2023లో హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 2023లో అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. 2023 క్యాలెండర్ ఇయర్‌లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో కనీసం 900 పరుగులు చేసిన ఆటగాళ్లలో క్లాసెన్‌దే అత్యధిక స్ట్రెయిక్ రేట్ కావడం గమనార్హం. ఈ జాబితాలో క్లాసెన్ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (137.91), ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో (118.22), టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (117.07), శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య (113.59), దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్‌క్రమ్ (113.26), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (112.66) ఉన్నారు. 



వన్డే వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ
వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడిన మ్యాచ్‌లో  హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ సాధించాడు. 61 బంతుల్లోనే సెంచరీ మార్కును తాకాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ వన్డే కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ. 


వేగవంతమైన సెంచరీ (ఎదుర్కొన్న బంతుల పరంగా)..
49 మార్క్‌రామ్ v శ్రీలంక, ఢిల్లీ 2023
50 కే ఓ’బ్రియన్ v ఇంగ్లండ్, బెంగళూరు 2011
51 గ్లెన్ మాక్స్‌వెల్ v శ్రీలంక, సిడ్నీ 2015
52 ఏబీ డివిలియర్స్ v వెంస్టిండీస్, సిడ్నీ 2015
57 ఇయాన్ మోర్గాన్ v ఆప్ఘానిస్తాన్ 2019
61 హెచ్ క్లాసెన్ v ఇంగ్లండ్, ముంబై 2023


వన్డేల్లో క్లాసెన్‌ రికార్డులు 
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 13 సిక్స్‌లు కొట్టిన రెండో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్.
వ‌న్డేల్లో స‌ఫారీ జ‌ట్టు త‌ర‌ఫున వేగ‌వంత‌మైన శ‌త‌కం బాదిన ఐదో క్రికెట‌ర్‌.
50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్ చేసిన 8వ‌ ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు.
ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ సెంచ‌రీ బాదిన రెండో స‌ఫారీ ప్లేయ‌ర్.