IND vs ENG Lord's Test: భారత్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 158 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా మారాడు. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న సహచరుడు జో రూట్‌ను వెనక్కి నెట్టేశాడు. హ్యారీ బ్రూక్ 886 పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. రూట్‌ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇద్దరి మధ్య 18 పాయింట్ల తేడా ఉంది. 

బ్రూక్ ర్యాంక్ పెరుగుదలకు ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బాగా తోడ్పడింది. హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్టులో 99 పరుగులు చేశాడు. తర్వాత ఎడ్జ్‌బాస్టన్ ఇన్నింగ్స్ అతనికి మంచి ప్రశంసలు లభించాయి. రెండో టెస్టులో రూట్‌ విఫలమవ్వడంతో బ్రూక్‌కు మంచి ఛాన్స్ లభించింది. 

హ్యారీ బ్రూక్ టెస్ట్ రికార్డ్

హ్యారీ బ్రూక్ 2022 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. తన కెరీర్ ప్రారంభంలోనే ఈ స్థానాన్ని సాధించాడు. బ్రూక్ ఇప్పటివరకు 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 45 ఇన్నింగ్స్‌లలో 2619 పరుగులు చేశాడు. బ్రూక్ టెస్ట్‌లో 59.5 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఈ ఆటగాడు తన మూడు సంవత్సరాల కెరీర్‌లో 317 పరుగుల అత్యధిక స్కోరును సాధించాడు.

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ 867 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారతీయ యశస్వి జైశ్వాల్ 858 పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ 813 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలుపుకున్నాడు.

6వ స్థానానికి శుబ్‌మాన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అతని ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ గణనీయంగా పెరిగింది. రెండు మ్యాచ్‌ల్లో అతని స్థిరమైన ప్రదర్శనతో 807 పాయింట్లతో 15 స్థానాలు ఎగబాకాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో అతని అద్భుతమైన సెంచరీలు ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషించాయి.

దిగజారిన రిషభ్‌ పంత్దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా 790 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ ఒక స్థానం దిగజారి బావుమాతో కలిసి ఏడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెటర్‌ కమిండు మెండిస్ 781 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ యువ వికెట్ కీపర్-బ్యాటర్ స్మిత్ టాప్ 10లోకి ప్రవేశించాడు. అద్భుతమైన ప్రదర్శనతో స్మిత్ 16 స్థానాలు ఎగబాకి ఇప్పుడు 753 రేటింగ్‌తో 10వ స్థానంలోకి చేరారు. 

ఇండియా vs ఇంగ్లాండ్ సిరీస్ 1-1తో సమం రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ఇంగ్లాండ్ 276 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయం పరుగులపరంగా టీమిండియా అతిపెద్ద విదేశీ విజయంగా నిలిచింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలో 269, 161 పరుగులు చేశారు.

భారత జట్టు భారీ స్కోరు చేయడంలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. ఇదే ఊపుతో లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్ ఉత్కంఠభరితమైన పోటీగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.