పసికూనల చేతిలో పరాజయం పాలైన ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా జట్లు కీలక సమరానికి రంగంలోకి దిగాయి. సెమీస్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన మ్యాచ్‌లో

టాస్‌ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌... దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ తిరిగి జట్టులో చేరడంతో ఇంగ్లాండ్‌ పటిష్టంగా మారింది. ఇటు ఆశ్చకరంగా దక్షిణాఫ్రికా సారిధి బవుమా ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మార్‌క్రమ్‌ ప్రొటీస్‌ పగ్గాలు అందుకున్నాడు.

 

ఈ రెండు జట్లు.. పసికూనల చేతిలో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి  ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. ఇంగ్లాండ్‌ను అఫ్ఘానిస్థాన్‌ మట్టికరిపించగా... దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాక్‌ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు 428 సాధించిన ప్రొటీస్‌... ధర్మశాలలో నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఢిల్లీలో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఓడిపోయింది. ఈ షాక్‌ల నుంచి కోలుకుని మళ్లీ గాడినపడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పసికూనల చేతిలో పరాజయం పాలైన ఈ రెండు జట్లు గెలుపుతో సెమీస్‌ వైపు బలంగా అడుగు వేయాలని భావిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌లు తలపడగా... బ్రిటీష్‌ జట్టు నాలుగు మ్యాచుల్లో... సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందాయి.

 

కానీ ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీగా పరుగులు సాధిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభంలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను వంద కంటే ఎక్కువ పరుగుల తేడాతో ప్రొటీస్‌ ఓడించింది. కానీ నెదర్లాండ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఇంగ్లాండ్‌ కూడా పేపర్‌పై చాలా బలంగా ఉంది. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు బెన్‌ స్టోక్స్ దూరమయ్యాడు. బెన్‌ స్టోక్స్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాడని.. తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నారు. ఇప్పటివరకు ఆడిన మూడుమ్యాచ్‌ల్లో బట్లర్‌ 43, 20, 9 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ భారీ స్కోరు చేయాలని బట్లర్ పట్టుదలతో ఉన్నాడు. బట్లర్‌తో పాటు లివింగ్‌స్టోన్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు రూట్, డేవిడ్ మలన్ కూడా భారీ స్కోరు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

 

ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వింటన్ డికాక్‌ రెండు శతకాలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. మార్‌క్రమ్‌... రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. కగిసో రబడ (7 వికెట్లు) మార్కో జాన్సెన్ (6 వికెట్లు) ఫామ్‌లో ఉన్నారు. లుంగీ ఎంగిడి (4 వికెట్లు) సాధించి పర్వాలేదనిపిస్తున్నాడు.

 

ఇంగ్లాండ్ ఫైనల్‌ 11: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్,  జోస్ బట్లర్ ( కెప్టెన్‌), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్,  గుస్ అట్కిన్సన్,  మార్క్ వుడ్,  రీస్ టోప్లీ, 

 

దక్షిణాఫ్రికా ఫైనల్‌ 11: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్,  మార్కో జాన్సెన్,  గెరాల్డ్ కోయెట్జీ,  కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగీ ఎంగిడి