Jos Butler : రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ మూడో బిడ్డకు తండ్రయ్యాడు. ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలకి తండ్రయిన బట్లర్ కు  మూడో  సంతానంగా మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని బట్లర్ బార్య, వ్యాయామ కోచ్ లూయీస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వెల్లడించింది. ఆ బాబుకు చార్లీ అని పేరు పెట్టినట్లు కూడా చెప్పింది. 


‘‘చార్లీ పుట్టి రెండు వారాలైంది. మేము కొత్తగా పుట్టిన మా బాబుతో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. కడుపుతో ఉన్న ఆడపిల్లలందరికీ శుభాకాంక్లలు. మీకు పుట్టబోయే బిడ్డలకు కూడా పుట్టబోయే రోజు శుభాకాంక్షలు’’ అని లూయీస్ పోస్ట్ చేసింది.  ‘‘ఈ ప్రపంచానికి నిన్ను స్వాగతిస్తున్నా చార్లీ బట్లర్’’ అనే కాప్షన్ పెట్టింది. దీంతో పాటు బేబీ బంప్ తో ఉన్న వీడియోని,  బిడ్డ ఫొటోను సైతం జతచేసింది.  ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.  


లూయీస్ ఎక్సర్ సైజ్ ఇన్ స్ట్రక్టర్ గా చేస్తోంది. తన ఇన్ట్సా ఖాతా ద్వారా పలు రకాల వ్యాయామ కసరత్తులను ఆమె పోస్టు చేస్తుంది. బిడ్డని కనేందుకు పదిహేను రోజుల ముందు వరకూ ఈ వ్యాయామాల వీడియోలు ఆమె ఖాతా నుంచి పోస్టవుతూనే ఉన్నాయి. 


చార్లీ రాకతో జోస్ బట్లర్ కుటుంబం అయిదుగురు సభ్యుల కుటుంబంగా మారింది. గతంలో బట్లర్ కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయిదేళ్ల జార్జియా రోస్, మూడేళ్ల మార్గొట్‌లకు చార్లీ జత కలవడంతో మొత్తం ముగ్గురు పిల్లలకు బట్లర్, లూయీస్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. 


మే 28 2024 న పుట్టిన చార్లీ తమ కుటుంబంలోకి రావడంతో ఈ జంట ఎంతో ఆనందంగా ఉన్నారు. దీనికి తోడు లూయిస్ పోస్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బట్లర్ కో క్రికెటర్లు, టీమ్ మేట్స్, అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఇప్పుడు ఈ పోస్టు వైరల్ గా మరింది. చాలా మంది అభిమానులు, టీమ్ మెట్లు, తోటి క్రికెటర్లు ఈ పోస్టుపై బాగా స్పందిస్తున్నారు. బట్లర్ దంపతులను శుభాకాంక్షలతో ముంచెత్తుుతున్నారు. 


క్రికెట్ ఫీల్డ్ లో తన నాయకత్వ లక్షణాలకి, తన వ్యూహాలకి ప్రసిద్ధి గాంచిన బట్లర్ చాలా సార్లు కుటుంబం ప్రాముఖ్యంపై మాట్లాడాడు. బట్లర్ కు భార్య అన్నా తన పిల్లలన్నా అమితమైన ఇష్టం. తన పిల్లలు తనకు ఎంత సంతోషాన్నిచ్చారో కూడా చాలా సార్లు ఆయన వెల్లడించాడు. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఈ కుటుంబంలో చేరిన చార్లీ కూడా బట్లర్ కు మరింత సంతోషాన్ని ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 


ఇంగ్లండ్ సూపర్ 8 కి చేరేనా..? 


ప్రస్తుతం బట్లర్.. టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ టీమ్ కు నాయకత్వం వహిస్తున్నాడు.  ఓ క్రికెటర్ గా తన విజయానికి తన ఫ్యామిలీనే కారణమని బట్లర్ చెబుతాడు.   బట్లర్ తన బిడ్డ పుట్టే సమయానికి లూయీస్ తో ఉండేందుకు పోయిన నెల బట్లర్  పాకిస్థాన్ తో జరిగిన ఓ టీ 20 మ్యాచ్‌ను ఎగ్గొట్టాడు. పాటర్నల్ లీవ్ పై తన వారి వద్దకు వెళ్లాడు. ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యే సరికి తిరిగి జట్టులోకి చేరాడు. పోయిన సారి ప్రపంచ కప్ ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం  తమ గ్రూప్ లో మూడో స్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోవడంతో పాటు ఒక మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో.. తమ గ్రూపులోె నమీబియాతో జరుగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 బెర్తు కన్ఫార్మ్ చేసుకునేందుకు ఈ జట్ట ప్రయత్నిస్తోంది.  రాజస్థాన్ రాయల్స్ టీమ్ సైతం బట్లర్‌కి బిడ్డ పుట్టడంపై శుభాకాంక్షలతో తన వెబ్సైట్ లో ప్రత్యేకంగా పోస్టు చేసింది.