ధోనీ..ఈ పేరుకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేక స్థానం ఉందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే  భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి(MS Dhoni) సంబంధించిన వివరాలు అవి ఏవైనా సరే ఆసక్తికరంగానే  ఉంటాయి. ధోని భార్య సాక్షి, ఇక ధోనీకి ఒక్కగానొక్క కుమార్తె జివా.  2006 ఫిబ్రవరి 6న జన్మించింది.  అంటే మరో రెండు నెలల్లో తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది ఈ చిన్నారి. కెప్టెన్  కూల్ గా ధోనీ గురించి అందరికీ తెలుసు. కానీ  ధోనీకే కాదు ధోనీ కుమార్తెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ధోనీ తన ముద్దుల కూతురు జీవాతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాతో పంచుకుంటాడు ధోని. అప్పుడప్పుడు ఆమె చేసే అల్లరి చూసి సంబరపడిపోతుంటారు. ధోనీ గారాలపట్టి  గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 


జివా జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో టౌరియన్ వరల్డ్ స్కూల్ లో చదువుతోంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న పాఠశాలగా దీనికి చాలా మంచి పేరుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి అమిత్ బజ్లా 2008లో దీన్ని స్థాపించారు.  65 ఎకరాల క్యాంపస్ లో ఉన్న ఈ స్కూల్  ఒక ప్రత్యేకమైన సమగ్ర విద్యా విధానాన్ని కలిగి ఉంది.  ఇక్కడి విద్యార్ధులకి సేంద్రియ వ్యవసాయం, గుర్రపు స్వారీ వంటి అనేక ప్రత్యేక  శిక్షణలు ఉంటాయి. అత్యున్నత విద్యనభ్యసించిన టీచర్లతో ఇక్కడ విద్యాబోధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రాక్టికల్ స్టడీస్‌తో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంపై కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమాన శ్రద్ధ కనబరుస్తారు. చదువుతో పాటూ తోటపని, క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వివిధ రకాల ఆటలు ఉంటాయి. ధోనీ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అతను  రాంచీలోని దావ్ జవహర్ విద్యామందిర్ విద్యార్థి. కానీ తన కుమార్తెను మాత్రం ఒక ప్రత్యేకమైన స్కూల్ లో వేశాడు. ఎందుకంటే  చదువు, స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ లో ముందుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట ధోని.  స్కూల్ లో ఎల్ కేజీ నుంచి 8 వ తరగతి వరకు టర్మ్ బోర్డర్ చైల్డ్ కు వార్షిక రుసుం సుమారు రూ.4.40 లక్షలు, 9 నుంచి 12 తరగతి వరకు యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీ, క్రీడా దుస్తులతో కలిపి సుమారు రూ.4.80 లక్షలు చెల్లించాలి. 


ఆస్తిపాస్తులు, అంతస్థులు, హోదాలు ఎన్ని మారినా మూలాలు మరిచిపోకూడదనేది పెద్దలు చెప్పేమాట. కానీ కాస్త పేరుప్రఖ్యాతులు, హోదా రాగానే చాలా మందికి గర్వం తలకెక్కుతూ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామనే దానిని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎంత ఎత్తుకు ఒదిగినా ఒదిగి ఉండే లక్షణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోనీ. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు, ఐపీఎల్‌లోనూ తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్లరూపాయల ఆస్తులు, అంతకుమించి కోట్లాదిమంది అభిమానులు. ఇన్ని సంపాదించుకున్నా సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు ఎంఎస్ ధోని.  తన ఊరికి వెళ్ళినప్పుడు, ఫాన్స్ తో గడిపే క్షణాలలోనూ అది పూర్తిగా తెలుస్తుంది.