Chanakyas Image That Looks Like MS Dhoni: మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా చాణక్యుడు సేవలు అందించారు. అర్థశాస్త్ర నిపుణుడు, తత్వవేత్త అయిన చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. తెలివి తేటల విషయానికి వస్తే కొందర్ని ఆచార్య చాణక్యుడితో పోల్చడం తెలిసిందే. తాజాగా చాణక్యుడు, క్రికెటర్ ఎంఎస్ ధోనీలా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు శాస్త్రవేత్తల బృందం టెక్నాలజీ సాయంతో తత్వవేత్త చాణక్యుడి 3D చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ రూపం టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని పోలి ఉంది. దాంతో చాణక్యుడి రూపం ఎంఎస్ ధోనిలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు దీన్ని ట్రోల్ చేస్తుండగా, మరికొందరు నవ్వుకునేందుకు మరో టాపిక్ దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, ఆచార్యుడు, వ్యూహకర్తగా ప్రసిద్ధి గాంచారు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో సేవలు అందించిన ఆయన అత్యంత ప్రసిద్ధి చెందిన అర్థశాస్త్రం గ్రంథాన్ని రచించారు. క్రీ.పూ 3వ శతాబ్దంలో రాజకీయాలు, నీతిపై రాసిన పుస్తకం ఇప్పటికీ అంతే ఫేమస్. అయితే ఫ్యాన్స్ ధోనీని క్రికెట్‌లో మాస్టర్ మైండ్, చాణక్యుడిగా వ్యవహరిస్తుంటారు. తన తెలివి తేటలతో భారత జట్టుకు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లు సైతం అందించాడు ధోనీ. కానీ చాణక్యుడి 3D రూపాన్ని తయారుచేస్తే అది అచ్చం ధోనీలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
బిహార్‌లోని మగధ డీఎస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తత్త్వవేత్త చాణక్యుడి రూపాన్ని రీక్రియేట్ చేయగా.. అది అచ్చం క్రికెటర్ ధోనీని పోలి ఉందని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అది చాణక్యుడి త్రీడీ ఇమేజా.. మేం ఎంఎస్ ధోనీ అనుకున్నామంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మెస్సేజ్ క్లియర్‌గా ఉందని.. తలా అంటే దేవుడు అని ట్రోల్ క్రికెట్ ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు.
మగధ అంటే 7 అని, దీంతో నిరూపణ అయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. మీకు ఇది చూస్తే ధోనీలా అనిపిస్తున్నాడా అని చాణక్యుడి త్రీడీ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు.
వాస్తవం ఏంటంటే..
బిహార్‌లో మగధ యూనివర్సిటీ ఉంది. కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మగధ డీఎస్ యూనివర్సిటీ లేదు. పైగా చాణక్యుడి త్రీడి ప్రతిరూపం క్రియేట్ చేశామని మగధ యూనివర్సిటీ ఏ ప్రకటన చేయలేదు. దాంతో ఇది ఫేక్ అని ధోనీ ఫ్యాన్స్, నెటిజన్లు చేసిన పోస్టులకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఐపీఎల్ 2024 విషయానికొస్తే..
అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. తన కెప్టెన్సీతో మ్యాజిక్ చేసి ఎన్నో కీలక మ్యాచ్‌లను గెలిపించి అదుర్స్ అనిపించుకున్నాడు. 40 ఏళ్లు దాటినా పాతికేళ్ల క్రికెటర్లకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఐపీఎల్ 2024 కోసం ఇటీవల చెన్నైకి చేరుకున్న ధోనీ నెట్స్ లో శ్రమిస్తూ ప్రాక్టీస్ సెషన్స్ లో కనిపించాడు. మరో టైటిల్ అందిస్తాడని సీఎస్కే ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.