ఆస్ట్రేలియా(Austrelia) క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టులకు, వన్డేలకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్(Pakistan)తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకొన్నాడు. ఆ సమయంలోనే వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే వార్నర్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. అయితే నేడు జరగనున్న మ్యాచ్‌కు మాత్రం ఈ మాజీ స్టార్ ఓపెనర్ హెలికాప్టర్( Helicopter)లో హీరో లెవల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ డాషింగ్ బ్యాటర్ ఓ రేంజ్‌లో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. హాలీవుడ్ హీరో మాదిరిగా వార్నర్ హెలిక్యాప్టర్‌లో మైదానంలో దిగి ఆ రోజు మ్యాచ్ ఆడనున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా జనవరి నేడు సిడ్నీ సిక్సర్స్- సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదిక కానుంది.
ఓపక్క సోదరుడి పెళ్లి.. మరోపక్క మ్యాచ్
నేడు సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్ ఉంది. ఇదే రోజు ఉదయాన్నే హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెళ్లి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హంటర్ వ్యాలీకి మధ్య 250 కిలోమీటర్ల దూరం ఉంది. దాంతో, వివాహ వేడుక వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బయలుదేరనున్నాడు. ప్రేక్షకులను అనుమతించడానికి ముందే అతడు స్టేడియానికి చేరుకుంటాడని సీడ్నీ థండర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం హంటర్ వ్యాలీప్రాంతంలో సోదరుడి పెళ్లి వేడుకలో ఉన్న వార్నర్, మ్యాచ్ సమయానికి ముందు హెలికాప్టర్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు దగ్గరలో ఉన్న అలియన్స్ ఫుట్‌బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ల్యాండ్ అవ్వనున్నాడు. వార్నర్ హాలీవుడ్ హీరో. రేపు వార్నర్ ల్యాండ్ అయ్యే సమయానికి తాను గేట్ బయట అతడి కోసం ఎదురుచూస్తానని... ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో వార్నర్ ఒకడని ఆసీస్ ప్లేయర్ సీన్ అబాట్ అన్నాడు.
రెండేళ్ల ఒప్పందం
బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ గతేడాది సిడ్నీ థండర్స్ రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌తో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అవనుంది. అయితే డొమెస్టిక్ లీగ్‌లో ఆడతానంటూ వార్నర్ ఇటీవల పేర్కొనడం వల్ల వచ్చే సీజన్‌లోనూ అతడిని చూడవచ్చు. బీబీఎల్ మ్యాచ్‌ల అనంతరం ఇంటర్నేషనల్ టీ20 లీగ్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నాడు. అక్కడ డేవిడ్ భాయ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టుతో కలువనున్నాడు. ఈ స్టార్ ఆటగాడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే చాన్స్ ఉంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ పొట్టి సిరీస్ జరుగనుంది.
రిటైర్ తర్వాత ప్లాన్ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడతానని ఇప్పటికే ప్రకటించిన వార్నర్.. ఫ్యూచర్ ప్లాన్స్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో కోచ్‌గా కూడా వచ్చే అవకాశముందని, తనకూ ఆ ఆసక్తి ఉందని వార్నర్ తెలిపాడు. భవిష్యత్తులో క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తానని వార్నర్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత ఫాక్స్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నేను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉందని... భవిష్యత్తులో తన ఆశయం కూడా అదేనని అన్నాడు. దీని గురించి ఇప్పటికే తన భార్యతో మాట్లాడానని వార్నర్ తెలిపాడు. ‘అవును. నేను ఫ్యూచర్‌లో కోచ్‌గా రావాలనుకుంటున్నాను. అయితే నా భార్యను అనుమతి అడగాలి. కోచ్‌గా ఉండాలంటే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా.. అందుకే ఆమె అనుమతి తప్పనిసరి..’ అంటూ వార్నర్ ఫన్నీగా వ్యాఖ్యానించాడు.