David Warner on Mitchell Johnson Comments: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఇటీవల ఆస్ట్రేలియా (Australia Cricketer) మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఏమైనా హీరోనా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఘనంగా వీడ్కోలు పలకడానికి వార్నర్ అర్హుడు కాదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని వార్నర్ బహిరంగంగా చెప్పడంపై కూడా మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిపోయిన వార్నర్‌కు ఎందుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆసిస్ మాజీ పేసర్ ప్రశ్నించాడు. దీనిపై తాజాగా డేవిడ్ వార్నర్ స్పందించాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందంటూ వార్నర్ వ్యాఖ్యానించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ముందుకు సాగడమే తనకు తెలుసని వార్నర్ స్పష్టం చేశాడు.
తన టెస్ట్ కెరీర్‌కు తప్పకుండా అద్భుతమైన ముగింపు లభిస్తుందని భావిస్తున్నానని ఆకాంక్షించాడు. తన తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో తాను పెరిగానని... ప్రతి రోజూ కష్టపడుతూనే ఉన్నానని గుర్తు చేసుకుంటూ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాక.. చాలా విమర్శలు ఎదుర్కోక తప్పదన్న వార్నర్... అందులోనూ కొన్ని సానుకూల అంశాలు ఉంటాయన్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మద్దతుగా నిలిచాడు. తాము ఒకరికొకరం అండగా ఉండాల్సిన అవసరం ఉందని కమిన్స్ తెలిపాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌కు సుదీర్ఘమైన కెరీర్ ఉందని.... మిచెల్ జాన్సన్ వ్యాఖ్యల వెనుక రహస్యమేంటో తనకు తేలీదని ఆసిస్ కెప్టెన్ తెలిపాడు. ఇప్పుడు ఆసీస్ క్రికెట్‌కు సంబంధించి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాల్సిన సమయమని అన్నాడు.
దీనిపై రికీ పాంటింగ్ కూడా స్పందించాడు. వివాదం ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. మిచెల్-డేవిడ్ కలిసి మాట్లాడుకోవాలని సూచించాడు. దాని కోసం తాను మధ్యవర్తిగా ఉండటానికైనా సిద్ధమని వెల్లడించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు సిరీస్ కోసం అంతా సిద్ధమవుతోందని.. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో దయచేసి ఎవరైనా చెప్పగలరా అని జాన్సన్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓ ఓపెనర్ తానే స్వయంగా రిటైర్మెంట్ తేదీ ప్రకటించుకునే అవకాశం ఇవ్వడం ఏమిటని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంలో కేంద్ర బిందువైన ఓ ఆటగాడికి హీరో తరహా వీడ్కోలు ఎందుకంటూ నిలదీశాడు.
బాల్‌టాంపరింగ్ వివాదంలో వార్నర్‌తో పాటు ఇతర ఆటగాళ్లూ ఉన్నారని గుర్తు చేశాడు. స్థానిక వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో జాన్సన్ ఈ వ్యాఖ్యుల చేశాడు. ఈ విమర్శలపై వార్నర్ ఇంతవరకూ స్పందించలేదు. డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ వార్నర్ ఆడితే.. వచ్చే నెల 3 నుంచి జరిగే సిడ్నీ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.