Team Austrelia : ఆస్ట్రేలియా(Austrelia) క్రికెట్‌(Cricket)  జట్టుకు ఈ ఏడాది స్వర్ణ యుగమనే చెప్పాలి. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా కంగారులు వన్డే ప్రపంచకప్‌(World cup) ను కూడా కైవసం చేసుకున్నారు. ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత్‌(Bharat)ను కంగుతినిపించి ఆరోసారి ప్రపంచ కప్‌ను సాధించారు. అయితె ప్యాట్ కమిన్స్‌ నేతృత్వంలోని జట్టు ఈ ఏడాది అద్భుతమే చేసింది. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా టెస్ట్ ఛాంపియన్ షిప్‌, వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ప్యాట్‌ కమిన్స్ సేన చిత్తు చేసింది. అది కూడా ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై జరిగిన యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. గతంలో యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా దగ్గరే ఉండటంతో ఇప్పుడు కూడా వాళ్ల దగ్గరే యాషెస్ ట్రోఫీ భద్రంగా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరినా ఓటమి పాలైంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను సొంతగడ్డపైనే ఫైనల్లో ఓడించి సగర్వంగా కప్పును ముద్దాడింది. ఇలా ఒకే ఏడాది మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి ఆస్ట్రేలియా 2023ను గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. 


వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ చేసిన పనిపై నెటిజన్లు మాజీలు, సహచర క్రికెటర్లు మండిపడుతున్నారు. ట్రోఫీ బ‌హూక‌ర‌ణ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్‌ సోఫాలో కూర్చొని ప్రపంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. ప్రతిష్ఠాత్మక ట్రోఫి పట్ల మిచెల్ మార్ష్ అవ‌మాన‌క‌రంగా ప్రవ‌ర్తించడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. మార్ష్ ఇదేం పని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత అహంకారం ఎందుకంటూ మరో నెటిజన్‌ ప్రశ్నించాడు. ద‌యచేసి మెగా ట్రోఫీకి కాసింత మ‌ర్యాద ఇవ్వండని మరో నెటిజన్‌ అభ్యర్థించాడు. ఆస్ట్రేలియ‌న్ల‌కు ఇది ఏమంత సిగ్గు చేటు కాదని మండిపడుతున్నారు. 


ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  టీమిండియా ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.