ODI World Cup 2023: భారత్‌ (Bharat)వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగిసింది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా(Team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma), వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat kohli) కి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.  ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్ల మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ప్రపంచకప్ ఫైనల్ ముగిసి సమయం గడుస్తున్నా ఆ బాధ నుంచి ఇప్పటికీ అభిమానులు కోలుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి కోలుకునేందుకు ఓ ప్రైవేట్‌ సంస్థ ఏకంగా సోమవారం తమ ఉద్యోగులకు సెలవివ్వడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


గురుగ్రామ్‌(Gurugram) లోని మార్కెటింగ్(Marketing Company) మూవ్స్ ఏజెన్సీ.. ప్రపంచకప్‌లో ఓడిపోయామన్న బాధ నుంచి కోలుకునేందుకు ఉద్యోగులకు సోమవారం సెలవు ఇచ్చింది. ఓటమి బాధను మరిచిపోయి మరింత స్ట్రాంగ్‌గా విధులకు హాజరయ్యేందుకు.. ఒకరోజు రిలాక్సేషన్ లీవ్ ఇస్తున్నట్లు ఉద్యోగులకు సందేశాలు పంపింది.  సోమవారం కంపెనీకి సెలవు ప్రకటిస్తున్నట్లు తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. దిశా గుప్తా అనే ఉద్యోగి ఈ విషయాన్ని లింక్డ్ ఇన్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎవరైనా మ్యాచ్ చూసేందుకు సెలవు ఇస్తారని.. కానీ ఓటమి నుంచి కోలుకునేందుకు కూడా సెలవు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజ్ స్క్రీన్  షాట్లను సైతం ఆమె సోషల్ వీడియోగా పంచుకుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్యాయి.


ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  టీమిండియా ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. 


ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్‌ స్టార్‌ పేర్కొన్నాడు.