Rishabh pant Road Accident: ఉత్తరాఖండ్‌ లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న  కారు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో రిషబ్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది.

Continues below advertisement











ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ, డెహ్రడూన్ హైలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా కారులో మండలు చెలరేగడంతో కారు నుంచి పంత్‌ కిందికి దూకేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనే ఒంటరిగా డ్రైవ్ చేసుకొని వస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. 







రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రూర్కీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేస్తూ పెను ప్రమాదం తప్పిందుకు దేవుడికి థాంక్స్ చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గెట్‌వెల్‌ సూన్‌ ఛాంప్ అంటూ ట్వీట్ చేశారు.