WPL Fastest 50 in 18 Balls: హెన్రీ ఊచకోత.. 18 బంతుల్లోనే ఫిఫ్టీ.. టోర్నీలోనే జాయింట్ ఫాస్టెస్ట్ 50 నమోదు.. యూపీ భారీ స్కోరు
WPL Fastest 50: టోర్నీలో నమోదైన టాప్ 5 ఫాస్టెస్ట్ ఫిఫ్టీలలో హెన్రీ, డంక్లీ (18 బంతులు), ఫెఫాలీ వర్మ (19 బాల్స్), సోఫీ డివైన్ (20 బాల్స్), హర్మన్ ప్రీత్ (22 బంతులు) ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

WPL 2025 UPW Vs DC Live Updates: వెస్టీండీస్ ప్లేయర్ చినెల్ హెన్రీ విధ్వంసక అర్థ సెంచరీ (23 బంతుల్లో 62, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) తో చెలరేగి డబ్ల్యూపీఎల్ లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒక దశలో 89-6తో నిలిచిన జట్టును హెన్రీ తన బ్యాటింగ్ పవర్ తో ఆదుకుంది. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ, జట్టుకు ఒంటిచేత్తో భారీ స్కోరును అందించింది. దీంతో గతంలో సోఫియా డంక్లీ నెలకొల్పిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేసింది. గుజరాత్ జెయింట్స్ కు చెందిన డంక్లీ.. ఆర్సీబీపై ఈ ఘనత సాధించగా, తాజాగా హెన్రీ దాన్ని సమం చేసింది. టోర్నీలో నమోదైన టాప్ 5 ఫాస్టెస్ట్ ఫిఫ్టీలను పరిశీలిస్తే హెన్రీ, డంక్లీ (18 బంతులు), ఫెఫాలీ వర్మ (19 బాల్స్), సోఫీ డివైన్ (20 బాల్స్), హర్మన్ ప్రీత్ కౌర్ (22 బంతులు) ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
120 సరిపోవని..
నిజానికి హెన్రీ బ్యాటింగ్ కు వచ్చేటప్పటికీ 89-6తో జట్టు ఇబ్బందుల్లో నిలిచింది. ఈ దశలో కోచ్ ఆమెతో ముచ్చటించారు. జట్టు స్కోరు 120 పరుగుల వరకు వెళితే సరిపోదని, కచ్చితంగా భారీ స్కోరు సాధించాల్సిందేనని టార్గెట్ విధించారు. దీంతో రావడంతోనే హెన్రీ పరుగుల వరద పారించింది. 2 ఫోర్లు మాత్రమే కొట్టిన ఈ వెస్టిండియన్.. 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. దీంతో ఊహించిన దానికంటే కూడా యూపీ భారీ స్కోరు సాధించింది. ఇక ఈ టోర్నీలో రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయిన యూపీ.. ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.
Read Also: India vs Pakistan: ఇటీవల పాక్ పై భారత్ దే పైచేయి.. చివరిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర పరాభవం.. రేపటి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీకి శుభారంభాన్ని అందించడంలో యూపీ బ్యాటర్లు విఫలమయ్యారు. కిరణ్ నవగిరే (17), దినేశ్ వృందా (4), కెప్టెన్ దీప్తి శర్మ (13), శ్వేతా షెరవాత్ (11), గ్రేస్ హరీస్ (2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. తాహ్లియా మెక్ గ్రాత్ (24) మంచి స్టార్ట్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ దశలో
బ్యాటింగ్ కు వచ్చిన హెన్రీ తన తడాఖా చూపించింది. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించింది. దీంతో 18 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసింది.