Canada vs Ireland, Canada beat Ireland by 12 runs: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో పసికూన కెనడా(Canada) తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఐర్లాండ్(Ireland)కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెనడాతో పోలిస్తే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఐర్లాండ్... ఈ స్కోరును సునాయసంగా ఛేదించేలా కనిపించింది. కానీ కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ కేవలం 125 పరుగులకే పరిమితమై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కెనడా... పాకిస్థాన్(Pakistan) దాటి మూడో స్థానంలో నిలిచింది.
Canada vs Ireland: ఐర్లాండ్‌కు కెనడా బిగ్ షాక్, పాయింట్ల పట్టికలో పాక్ కంటే పైకి
Jyotsna
Updated at:
08 Jun 2024 06:36 AM (IST)
T20 World Cup Highlights: పసికూన కెనడా.. ఐర్లాండ్‌కు షాకిచ్చింది. నసావు క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో కెనడా 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.
కేక పుట్టించిన కెనడా , ఐర్లాండ్ పై ఘన విజయం (Photo Source: Twitter/@ICC )
NEXT
PREV
లో స్కోరింగ్ అయినా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్... కెనడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కెనడా బ్యాటర్లు తడబడ్డారు. కెనడా బ్యాటర్లలో నికోలస్ కిర్టన్, వికెట్ కీపర్ శ్రేయాస్ మొవ్వా రాణించారు. కిర్టన్ 35 బంతుల్లో 49 పరుగులు చేయగా... మొవ్వా 36 బంతుల్లో 37 పరుగులు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో కెనడా 137 పరుగులు చేయగలిగింది. టీ 20 ప్రపంచకప్‌లో నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తొలిసారి ఓ జట్టు 100కుపైగా పరుగులు చేసింది. కీర్టన్, మొవ్వ మినహాయించి మిగిలిన బ్యాటర్లు ఎవరూ 20 పరుగుల మార్క్‌ను దాటలేదు. దీంతో కెనడా ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అధిర్ 1, యంగ్ 2, మెక్ కార్తి రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో కష్టాలు
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ను కెనడా బౌలర్లు కట్టడి చేశారు. తొలి వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యం రావడంతో ఐర్లాండ్ సునాయసంగానే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కెనడా బౌలర్లు పుంజుకున్నారు. 9 పరుగులు చేసిన పాల్ స్టిర్లింగ్‌ను గోర్డాన్ అవుట్ చేసి ఐర్లాండ్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా మెరుగ్గా రాణించలేదు. జార్జ్ డాక్రెల్ (30 నాటౌట్), మార్క్ అడైర్ (24 బంతుల్లో 34) ఇద్దరూ 62 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో ఐర్లాండ్‌ను గెలుపు దిశగా నడిపించారు. కానీ విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయారు. కెనడా బౌలర్లు జెరెమీ గోర్డాన్ (2/16), డిల్లాన్ హేలిగర్ (2/18) అద్భుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించారు. ఐర్లాండ్ కేవలం 27 పరుగుల తేడాతో 4 వికెట్లు పడిపోయాయి. టకర్ (10), టెక్టార్ (7), కాంఫెర్ (4), డెల్నీ (3) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. ఐర్లాండ్ 12 ఓవర్లలోనే 59 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. 26 పరుగుల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోని ఐర్లాండ్ 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరం కాగా కెనడా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులే ఇచ్చారు. దీంతో కెనడా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published at:
08 Jun 2024 06:36 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -