Siraj Vs Mahira Sharma: భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై మళ్లీ డేటింగ్ కథనాలు వస్తున్నాయి. లేటెస్టుగా బిగ్ బాస్ సెలెబ్రిటి, టీవీ యాక్ట్రెస్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇన్స్ట్రాగ్రాంలోని మహిరా పోస్టుపై సిరాజ్ లైక్ కొట్టాడు. అది కూడా గతేడాది నవంబర్ కు చెందినది కావడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. బిగ్ బాస్ ద్వారా చాలామంది అభిమానులను మహిరా సంపాదించుకుంది. ఆమె అందం, అభినయం, ఫన్ పర్సనాలిటీ, డెసిషన్ మేకింగ్ తదితర కారణాల వల్ల ఆమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆమెకు సంబంధించిన వార్త క్షణాల్లో వైరలవుతోంది. ఇక సిరాజ్ పై కూడా డేటింగ్ వదంతలు రావడం ఇది రెండోసారి. 


సహనటుడితో బ్రేకప్..
మరోవైపు బిగ్ బాస్ లో ఉండగానే పరిచమైన పారస్ ఛాబ్రేతో మహిరా గతంలో డేటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఛాబ్రాను ఆమె అన్ ఫాలో చేసింది. మరోవైపు సిరాజ్ తో డేటింగ్ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ స్పందించింది. తన కూతురిపై లేనిపోని పుకార్లు పుట్టించవద్దని, ఆమె ఎవరితోనూ డేటింగ్ లో లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్ పై ఫోకస్ పెట్టిందని, అనవసర విషయాల్లోకి తనను లాగవద్దని పేర్కొంది. అయితే తాజా వ్యాఖ్యలపై సిరాజ్ స్పందించలేదు. అలాగే మహిరా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, వీరి సన్నిహితులు మాత్రం సిరాజ్, మహిరా మధ్య రిలేషన్ షిప్ ప్రారంభమైందని చెబుతుండంపై గందరగోళం నెలకొంది. ఇక టీమిండియా వైట్ బాల్ సిరీస్ నుంచి ప్రస్తుతం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తను ఐపీఎల్లోనే బరిలోకి దిగుతాడు. 


వివాదానికి తెరదించిన సిరాజ్..
మరోవైపు గతవారం వర్థమాన సింగర్, జనాయ్ భొంస్లేతో డేటింగ్ చేస్తున్న వార్తలను సిరాజ్ పరోక్షంగా ఖండించాడు. సోషల్ మీడియా ద్వారా సరైన సమాధానమిచ్చాడు. జనాయ్ భోంస్లే బర్త్ డే సందర్భంగా ఆమెతో సిరాజ్ దిగిన పిక్‌ ఒక్కసారి వైరల్‌గా మారింది. సిరాజ్‌కు ఆమెకు మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగాయి. దీంతో ఈ విషయంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది. తాజాగా జనాయ్.. దీనిపై స్పందించింది. సిరాజ్ తనకు కేవలం అన్నలాంటోడని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్‌లో తెలిపింది. మేరీ ప్యారా భయ్యా అంటే నా ప్రియమైన సోదరుడా అని పోస్ట్ చేసింది.


తాజాగా ఈ పోస్టుపై అభిమానలు స్పందింస్తున్నారు. సిరాజ్ ప్రేమలో ఉన్నాడని అపార్థం చేసుకున్నమని, ఇద్దరు అన్నాచెళ్లెల్లా..? అని ఆశ్చర్య పడుతున్నారు. ఇక సిరాజ్ కూడా అదే పోస్టుపై బహన్ అంటే చెల్లెలు అని సంబోధించాడు. దీంతో మహిరాపై డేటింగ్ పైనే సిరాజ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు. 


Also Read: Virat Kohli Craze: క్రేజ్ కా బాప్.. కోహ్లీకి ఏమాత్రం తగ్గని క్రేజ్.. అతడిని చూడటానికి ఉ. 3 గంటల నుంచే స్టేడియానికి..