Best Test Match In Modern Days: మోడర్న్ డే టెస్టు క్రికెట్ లో బెస్ట్ టెస్ట్ అంటే మీరేం చెప్తారు.... ఏ క్రికెట్ ఫ్యాన్ ని అడిగినా సరే.... లాస్ట్ కి వచ్చేసరికి రెండు ఆప్షన్స్ దగ్గర కచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ ది మన ఇండియా గబ్బా గడ్డ మీద సాధించిన విజయం. 32 ఏళ్ల తర్వాత వచ్చిన అపురూప విజయం. ఆ సిరీస్ లో భారత్ ఎదుర్కొన్న సవాళ్లెన్నో. ఇక రెండో టెస్టు.... 2019 ఇంగ్లండ్ వర్సెస్ యాషెస్ ఎడ్జ్ బాస్టన్ టెస్టు. క్రికెట్ ఫ్యాన్స్ ని అడిగితే మాత్రం దీన్ని బెన్ స్టోక్స్ టెస్ట్ అంటారు. అప్పటికే కొన్ని నెలల ముందు వరల్డ్ కప్ హీరోగా అవతరించిన బెన్ స్టోక్స్.... ఈ ఒక్క మ్యాచ్ తో మోడర్న్ డేలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్ గా ఎదిగాడు.


2019... ఇంగ్లాండ్ లో యాషెస్ సిరీస్ జరుగుతోంది. 2 మ్యాచెస్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 1-0తో లీడింగ్ లో ఉంది. మూడో మ్యాచ్ గెలిస్తే.... ఇక సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. మహా అయితే ఇంగ్లాండ్ తో కలిసి డ్రా చేసుకోవాల్సి వచ్చేది. వారి ఆశలు, అంచనాలకు తగ్గట్టుగానే మూడో టెస్టు దాదాపుగా వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. కానీ ఆ ఒక్కడు నిలబడ్డాడు. ఆసీస్ చేతుల్లో నుంచి మ్యాచ్ ను లాక్కుని మరీ ఇంగ్లండ్ కు హిస్టారికల్ విజయాన్ని అందించాడు. ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా... 179 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఇంగ్లాండ్ అంతకన్నా ఘోరంగా 67 పరుగులకే దుకాణం సర్దేసింది. రెండో ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.... ఇంగ్లండ్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అసలే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పూర్తి ఫెయిల్యూర్. ఇంత భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎప్పుడూ ఛేదించిందే లేదు. ఇంగ్లండ్ గెలుస్తుందన్న నమ్మకమే ఎవరికీ లేదు. టఫ్ సిట్యుయేషన్స్ ను జయిస్తే హీరోలు పుడతారు. ఆల్మోస్ట్ ఇంపాజిబుల్ సిట్యుయేషన్స్ ను పాజిబుల్ గా మారిస్తేనే లెజెండ్స్ అవతరిస్తారు. ఈ ఒక్క మ్యాచ్ తో బెన్ స్టోక్స్ దాదాపుగా ఆ కేటగిరీలో చేరిపోయాడు.


సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ మిడిలార్డర్ అప్పటిదాకా బానే ఆడింది. జో రూట్, జో డెన్లీ, జానీ బెయిర్ స్టోతో కలిసి బెన్ స్టోక్స్ మంచి ప్లాట్ ఫాం వేశాడు. 359 రన్స్ చేజింగ్ లో 245 ఫర్ 4 వరకు ఇంగ్లండ్ బానే ఉంది. కానీ సీన్ కాస్త కట్ చేస్తే చాలు.... 286 ఫర్ 9 వికెట్స్. అంటే 41 పరుగుల తేడాలో 5 వికెట్లు ఫసక్. బెన్ స్టోక్స్ ఒక్కడే లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాటర్. అప్పుడు క్రీజులోకి వచ్చిన పదకొండో నెంబర్ బ్యాటర్ జాక్ లీచ్. లక్ష్యానికి ఇంకా 73 పరుగుల దూరం. ఆసీస్ కు ఒక్క వికెట్ వస్తే చాలు. ఇలాంటప్పుడే స్టోక్స్ సిట్యుయేషన్ ను సూపర్ గా హ్యాండిల్ చేశాడు. ఎక్కువ శాతం స్ట్రైక్ తన వద్దే ఉంచుకుంటూ వచ్చాడు. అటాకింగ్ గేమ్ ఆడుతూనే స్ట్రైక్ కూడా కాపాడుకున్నాడు. విజయానికి 2 పరుగుల దూరం వరకు ఇంగ్లండ్ ను ఒంటిచేత్తో తీసుకొచ్చాడు. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ లేకపోతే ఎలా చెప్పండి. ఆ 2 పరుగుల దూరంలో ఉన్నప్పుడే వరుసగా రెండు ట్విస్టులు. జాక్ లీచ్ ను సులభంగా రనౌట్ చేసే అవకాశాన్ని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ వదిలేశాడు. ఆ తర్వాత స్టోక్స్ ఎల్బీగా వెనుదిరగాల్సింది. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ రివ్యూ కోరేందుకు ఆసీస్ వద్ద రివ్యూ బ్యాలెన్స్ లేదు. ముందు ఓవర్ లోనే ఓ అన్ సక్సెస్ ఫుల్ రివ్యూ తీసుకున్నారు. రివ్యూస్ అయిపోయాయి. ఆ రకంగా ఇంగ్లండ్ కు లక్ రెండు సార్లు సహకరించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోక్స్ ఓ ఫోర్ కొట్టి మెగ్నిఫిసెంట్ విజయాన్ని టీంకు అందించాడు. 135 నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ కు ఇదే అత్యంత పెద్ద లక్ష్య ఛేదన. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 70 కన్నా తక్కువకు ఆలౌట్ అయి.... పైనల్లీ మ్యాచ్ ను గెలుచుకోవడం 131 ఏళ్లల్లో ఇదే తొలిసారి. ఈ అమేజింగ్ టెస్ట్ మ్యాచ్ అండ్ సూపర్బ్ ఇన్నింగ్స్ కు నేటికి మూడేళ్లు.


సో ఇప్పుడు చెప్పండి... మీ ఫేవరెట్ మోడర్న్ డే టెస్ట్ ఏంటి...? గబ్బానా..? ఈ బెన్ స్టోక్స్ టెస్టా..? లేదా రెండూ అనేస్తారా..?