Changes in Indian cricket Team's Support Staff: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలు బీసీసీఐను చికాకు పెట్టించాయి. ప్లేయర్లకు, కోచ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. అందుకే ఈ టోర్నీ కోసం ప్రిపరేషన్ సరిగా జరగలేదని అప్పట్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. గంభీర్‌కు మిగతా సీనియర్ ప్లేయర్లకు అసలు పడటం లేదనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను లీక్ చేసిన వారిపై ఇప్పుడు బీసీసీఐ వేటు వేసింది. ఇన్ని రోజులు దీనిపై విచారణ చేసి ముగ్గుర్ని విధుల నుంచి తప్పించింది. ఇందుోల సహాయ కోచ్ కూడా ఉన్నారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్ చేశారనే కారణంతో బీసీసీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు BCCI సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌ను తప్పించింది. అతని పదవీకాలం 8 నెలల క్రితమే ప్రారంభమైంది. BGT సిరీస్ ఓడిన తర్వాత BCCI సమీక్ష సమావేశం నిర్వహించింది. డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వెళ్తున్నాయని అందులో కొందరు ఫిర్యాదులు చేశారు.
వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌తోపాటు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, శిక్షకుడు సోహం దేశాయ్‌ను విధుల నుంచి తప్పించాలని తెలుస్తోంది. నాయర్ స్థానంలో మరో వ్యక్తిని నియమించే ఆలోచన లేనట్టుగా బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్ ఇప్పటికే జట్టుతో ఉన్నారని తెలిపింది. దిలీప్ పనిని సహాయకుడు కోచ్ రయాన్ టెన్ డెస్కాటే చూసుకుంటాడని వెల్లడించింది.
శిక్షకుడు సోహం దేశాయ్ స్థానంలో ఆడ్రియన్ లిరు రానున్నారు. ఇతను ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో కలిసి పని చేస్తున్నాడు. అతను 2008 నుంచి 2019 వరకు KKR జట్టుకు సేవలు అందించారు. 2002 నుంచి 2003 వరకు భారత జట్టుతో కూడా కలిసి పని చేశారు. మళ్లీ అతన్ని తీసుకురానుంది. ఇప్పటికే BCCI తో ఒప్పందం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు.
వివాదాలతో నిండిన BGT సిరీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ నుంచి తనను స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. టోర్నీ జరుగుతున్న అన్ని రోజులు కూడా జట్టులో సఖ్యత లేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే టైంలో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్న అంశాలు బయటకు రావడం మొదలైంది.
ఇలా లీకులు రావడంతో, ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో వివాదంపై రచ్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక స్థిరత్వం దెబ్బతింటుందని గ్రహించిన ఓ ప్లేయరర్ BCCIకి ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా టీమిండియా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. దీంతో 3-0 తేడాతో ఓడిపోయింది.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియాలో ఈ కీలకమైన వ్యక్తులను తప్పించింది. లీకులకు వీళ్లే కారణని భావించి చర్యలు తీసుకుంది.