ధోనీ..ఈ పేరుకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేక స్థానం ఉందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత జెర్సీ నంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం ఇచ్చింది. అంటే ఇక పై భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానం. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే టీ20 వరల్డ్ కప్ గెలిచిన ధోనీ.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ సాధించాడు. ఇలా వరుసగా ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీరికార్డులకెక్కాడు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ..అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఇప్పుడు కేవలం ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. ధోనీ గౌరవార్థం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్తిపాస్తులు, అంతస్థులు, హోదాలు ఎన్ని మారినా మూలాలు మరిచిపోకూడదనేది పెద్దలు చెప్పేమాట. కానీ కాస్త పేరుప్రఖ్యాతులు, హోదా రాగానే చాలా మందికి గర్వం తలకెక్కుతూ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామనే దానిని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎంత ఎత్తుకు ఒదిగినా ఒదిగి ఉండే లక్షణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోనీ. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు, ఐపీఎల్‌లోనూ తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్లరూపాయల ఆస్తులు, అంతకుమించి కోట్లాదిమంది అభిమానులు. ఇన్ని సంపాదించుకున్నా సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు ఎంఎస్ ధోని. తన ఊరికి వెళ్ళినప్పుడు, ఫాన్స్ తో గడిపే క్షణాలలోనూ అది పూర్తిగా తెలుస్తుంది.
ఇక కెరీర్ తొలి నాళ్లలో పేసర్ శార్దుల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీని ధరించాడు. దీంతో ఈ విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడిచింది. దీంతో పదో నెంబర్ జెర్సీ రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏడో నెంబర్ జెర్సీ విషయంలో బోర్డు జాగ్రత్తపడింది. మిగతా ఆటగాళ్లెవరకూ ఆ నెంబర్ జెర్సీని అందుబాటులో ఉండకుండా చూసుకుంది.
ప్రస్తుతం భారత ఆటగాళ్లకు మొత్తం 60 జెర్సీ నెంబర్లను కేటాయించినట్లు బీసీసీఐ గతంలో వెల్లడించింది. అయితే ఎవరైనా ఓ ఆటగాడు ఏడాదిపాటు జట్టుకు దూరమైనప్పటికీ.. ఆ జెర్సీని కొత్త ప్లేయర్‌కు కేటాయించరు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంచుకోవడానికి ఇంకా 30 జెర్సీ నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని బీసీసీఐ అధికారులు తెలిపారు.