BCCI Drops Ten Doeschate And Dilip:  ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా వరుస ఓటముల తర్వాత BCCI బిగ్ యాక్షన్ స్టార్ట్ చేసింది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ల కాంట్రాక్టులను రీన్యూ చేయడం లేదని బిసిసిఐ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ డెవలప్‌మెంట్ కు సంబంధించి బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. మెన్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ గా ర్యాన్ టెన్ డోషేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో కంప్లీట్ కాగా, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ వన్ ఇయర్ ఎక్స్‌టెన్షన్ టర్మ్ జూన్ 8తో ఎండ్ అయిందని సైకియా స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) టూర్ ఎండ్ అయ్యే వరకు వీరిని కంటిన్యూ చేసినప్పటికీ, ఇకపై ఎక్స్‌టెన్షన్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంట్రాక్ట్ టైమ్ ముగిసింది కాబట్టి రెసిగ్నేషన్స్ స్వీక‌రించే అవ‌కాశ‌ముంది.

Continues below advertisement

Read Also: Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ

నయా ఫీల్డింగ్ కోచ్ రేస్ లో శుభదీప్ ఘోష్.. ఇద్దరు ముగ్గురు కాండిడేట్లతో డిస్కషన్స్న్యూ ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ఆల్రెడీ కొంత‌మంది కాండిడేట్లతో టాక్స్ జరుపుతోందని సైకియా చెప్పారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో రాహుల్ ద్రవిడ్ టైమ్ నుంచి గత ఆరేడేళ్లుగా సిస్టమ్ లో ఉన్న అస్సాంకి చెందిన శుభదీప్ ఘోష్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక త్వరలోనే కంప్లీట్ కానుందని బిసిసిఐ ఆఫీషియల్స్ చెబుతున్నారు. 

Continues below advertisement

Read Also: Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

గౌతమ్ గంభీర్ వర్సెస్ ర్యాన్ టెన్ డోషేట్.. రోల్ మిస్సింగ్ వివాదంహెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టడం వల్లే ర్యాన్ టెన్ డోషేట్ ను టీమ్ లోకి తీసుకున్నారు. స్టార్టింగ్ లో అతనికి ఫీల్డింగ్ కోచ్ రోల్ ఇస్తామని ప్రామిస్ చేసినప్పటికీ, లాస్ట్ టూ ఇయర్స్ లో అతనికి ఎటువంటి స్పెసిఫిక్ రోల్ ఇవ్వలేదు. దీంతో టెన్ డోషేట్ కూడా టీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ముందే ఫిక్స్ అయ్యాడు.

సీనియర్ సూపర్ స్టార్ సపోర్ట్ ఉన్నా దక్కని ఎక్స్‌టెన్షన్.. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ముందు ఒక సీనియర్ సూపర్ స్టార్ ప్లేయర్ సపోర్ట్ వల్ల అతనికి వన్ ఇయర్ ఎక్స్‌టెన్షన్ లభించింది. అయితే అతని వర్క్ పట్ల బిసిసిఐ మేనేజ్‌మెంట్ హ్యాపీగా లేదు. రీసెంట్ గా ముగిసిన యూకే వైట్ బాల్ టూర్ లో ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ చాలా పూర్ గా ఉండటంతో దిలీప్ కి మరో ఎక్స్‌టెన్షన్ ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయిందని స‌మాచారం.