Saransh Jain Earns Maiden Test Call Up:  శ్రీలంకతో జరగబోయే టూ-మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల ఆఫ్-స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కు నేషనల్ టీమ్ నుంచి పిలుపు లభించింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో పాటు లెఫ్ట్ హ్యాండ్ తో లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల జైన్.. సుందర్ కి లైక్-ఫర్-లైక్ పర్ఫెక్ట్ రిప్లేస్‌మెంట్ గా టీమ్ లోకి వచ్చాడని తెలుస్తోంది.

Continues below advertisement

Continues below advertisement

దశాబ్ద కాలంగా ఫస్ట్ క్లాస్ రికార్డులు.. చంద్రకాంత్ పండిట్ కోచింగ్ లో వండర్స్ఇండోర్ కు చెందిన సారాంశ్ జైన్ గత పదేళ్లుగా డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2014 లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అతను సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌లకు మెయిన్ ప్లేయర్ గా మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 181 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 2,223 రన్స్ సాధించాడు. సారాంశ్ తండ్రి సుబోధ్ జైన్ కూడా రంజీల్లో మధ్యప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహించిన ఆఫ్ స్పిన్నరే. సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ గైడెన్స్ లో  జైన్ మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ గా డెవలప్ అయ్యాడు. 2022 లో మధ్యప్రదేశ్ సాధించిన హిస్టారిక్ ఫస్ట్ రంజీ ట్రోఫీ విక్టరీలో ఇతను కీ రోల్ ప్లే చేశాడు.

Read Also: Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ 

ఇండియా ఏ పర్ఫార్మెన్స్ తో నేషనల్ టీమ్ కాల్-అప్.. శ్రీలంక ఏ తో జరిగిన సెకండ్ అన్‌అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ లో సారాంశ్ జైన్ సిక్స్ వికెట్స్ తీసి, నాటౌట్ గా 70 రన్స్ చేసి అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఆల్‌రౌండ్ షోతో ఇంప్రెస్ అయిన అజిత్ అగార్కర్ లీడ్ లోని సెలెక్షన్ కమిటీ అతనికి ఫస్ట్ టెస్ట్ కాల్-అప్ ఇచ్చింది. రవీంద్ర జడేజా కంబ్యాక్ ఇస్తున్న ఈ సిరీస్ లో సుందర్ ప్లేస్ లో జైన్ సబ్ కాంటినెంటల్ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో బిగ్ అసెట్ గా మారనున్నాడు.

ఐపీఎల్ లో అన్ సోల్డ్ ప్లేయర్.. టెస్ట్ లలో మాత్రం సూపర్ చాన్స్డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్ లో మైండ్ బ్లాకింగ్ రికార్డులు ఉన్నప్పటికీ, ఐపీఎల్ లో మాత్రం సారాంశ జైన్ కు నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2024, 2025, 2026 వేలం పాటల్లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. లాస్ట్ ఇయర్ షార్ట్ లిస్ట్ లోకి వచ్చినా అన్ సోల్డ్ గానే మిగిలిపోయిన సారాంశ జైన్, ఇప్పుడు ఏకంగా ఇండియన్ టెస్ట్ టీమ్ లో చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింద‌ని నిపుణులు అంటున్నారు.