Online Gaming Bill 2025 | ముంబై: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు వచ్చిన తర్వాత 'డ్రీమ్11' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బిల్లు ఆమోదం పొందిన కొద్ది రోజులకే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రీమ్11తో స్పాన్సర్‌షిప్ డీల్‌ను BCCI రద్దు ముగించింది. డ్రీమ్11 అధికారులు సైతం BCCI CEO హేమంగ్ అమీన్ ముందు తాము ఈ డీల్‌ను కొనసాగించలేమని స్పష్టం చేశారు. 2023లో బీసీసీఐ జెర్సీ స్పాన్సర్‌గా ఈ డీల్ ప్రారంభమైంది, 2026 వరకు కొనసాగాల్సి ఉంది, తాజాగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారడంతో బీసీసీఐ ఈ నిరర్ణయం తీసుకుంది.
కేంద్రం తెచ్చిన బిల్లుతో మొదలైన సమస్య
రిపోర్ట్స్ ప్రకారం.. BCCIకి చెందిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ, "డ్రీమ్11కి చెందిన కొంతమంది ప్రతినిధులు BCCI ఆఫీసుకు వచ్చి CEO హేమంగ్ అమీన్ తో తాము స్పాన్సర్‌షిప్ డీల్‌ను కొనసాగించలేమని స్పష్టం చేశారు. అంటే ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జెర్సీపై 'Dream11' అని ఉండదు. BCCI త్వరలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం కొత్త టెండర్‌లను ఆహ్వానించనుంది " అన్నారు. ఆసియా కప్‌లో తలపడే భారత జట్టు కొత్త స్పాన్సర్ పేరుతో జెర్సీలను ధరించనుంది.
డీల్ మధ్యలోనే ముగిసినందుకు ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఎందుకంటే కాంట్రాక్ట్‌లో ఒక నిబంధన చేర్చారు. ప్రభుత్వాలు తీసుకువచ్చే ఏదైనా విధానం, చట్టాల కారణంగా స్పాన్సర్ షిప్ మీద ప్రభావం చూపితే బోర్డుకు అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ డ్రీమ్ 11 ప్రతినిధులు బీసీసీఐని సంప్రదించకపోయినా, భారత క్రికెట్ బోర్డు కేంద్రం నిబంధనలకు కట్టుబడి డీల్ రద్దుకు ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. పరస్పరం చర్చించుకుని స్పాన్సర్‌షిప్ డీల్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.
అతిపెద్ద ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫాంగా డ్రీమ్ 11..
దాదాపు 18 సంవత్సరాల క్రితం డ్రీమ్11 ప్రారంభమైంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ప్రస్తుతం డ్రీట్ 11 బ్రాండ్ విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 69 వేల కోట్ల రూపాయలు అని అంచనా. BCCI జూలై 2023లో డ్రీమ్11తో రూ. 358 కోట్లకు స్పాన్సర్‌షిప్ డీల్‌పై సంతకం చేసింది. వచ్చే ఈ డీల్ గడువు ముగియనుంది. కానీ కేంద్ర తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో తమకు ఇబ్బందులు తప్పవని భావించిన డ్రీమ్ 11 భారత క్రికెట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని భావించింది. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలతో చర్చించగా అధికారికంగా డీల్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.