BCCI announces annual player retainership 2024 25 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 సీజన్ కు గానూ టీమ్ ఇండియా (సీనియర్ మెన్స్ టీమ్) కాంట్రాక్టులను పునరుద్దరించింది. అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు కోసం టీమ్ ఇండియా క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను సోమవారం నాడు ప్రకటించింది. బీసీసీఐ మొత్తం 34 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కి తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కింది. గతేడాది క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరినీ తప్పించిన బీసీసీఐ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కు.. తాము సూచించినట్లు దేశవాళి మ్యాచ్ లు ఆడిన ఇషాన్ కిషన్ కు సైతం కాంట్రాక్ట్ ఇచ్చింది. అయ్యర్‌కు గ్రేడ్ బీ, ఇషాన్ కిషన్ కు గ్రేడ్ సీలో అవకాశం లభించింది.
A+ గ్రేడ్ లో నలుగురు క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది.1. రోహిత్ శర్మ2. విరాట్ కోహ్లీ3. జస్ప్రీత్ బుమ్రా4. రవీంద్ర జడేజా
A గ్రేడ్ లో ఆరుగురు క్రికెటర్లకు అవకాశం5. మహ్మద్ సిరాజ్6. KL రాహుల్7. శుభమాన్ గిల్8. హార్దిక్ పాండ్యా9. మహ్మద్ షమీ10. రిషబ్ పంత్
బి గ్రేడ్ లో 5 క్రికెటర్లకు అవకాశం11. సూర్యకుమార్ యాదవ్12. కుల్దీప్ యాదవ్13. అక్షర్ పటేల్14. యశస్వి జైస్వాల్15. శ్రేయాస్ అయ్యర్
సీ గ్రేడ్‌లో 15 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్
16. రింకూ సింగ్17. తిలక్ వర్మ18. రుతురాజ్ గైక్వాడ్19. శివమ్ దూబే20. రవి బిష్ణోయ్21. వాషింగ్టన్ సుందర్22. ముఖేష్ కుమార్23. సంజు శాంసన్24. అర్ష్దీప్ సింగ్25. ప్రసిద్ధ్ కృష్ణ26. రజత్ పాటిదార్27. ధృవ్ జురెల్28. సర్ఫరాజ్ ఖాన్29. నితీష్ కుమార్ రెడ్డి30. ఇషాన్ కిషన్31. అభిషేక్ శర్మ32. ఆకాష్ దీప్33. వరుణ్ చక్రవర్తి34. హర్షిత్ రాణా
బీసీసీఐ గతంలో అన్ని ఫార్మాట్లలో రెగ్యూలర్ గా ఆడుతున్న ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ కేటగిరీ కింద సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చేది. కానీ తాజాగా ఈ కేటగరిలో ఛాన్స్ ఇచ్చిన నలుగురిలో ముగ్గురు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. జస్ప్రిత్ బుమ్రా మాత్రమే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోసం ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది.
మూడు ఫార్మాట్లో కొనసాగుతున్న కొందరు క్రికెటర్లకు ఏ కేటగిరి కాంట్రాక్ట్ ఇచ్చింది బీసీసీఐ. వారిలో మహ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా వీరు కొనసాగుతున్నారు.
గ్రేడ్ బీలో ఐదుగురు క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ మేనేజ్‌మెంట్. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ లు ఈ కేటగిరీలో ఉన్నారు. భవిష్యత్తులో వీరు ఏ, ఏ ప్లాస్ గ్రేడ్ కిందకు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది.