ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేలకు టీమిండియా జట్లను ప్రకటించింది. జులై 7వ తేదీ నుంచి జులై 10వ తేదీ వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు టీ20లు జరగనున్నాయి. ఇక వన్డే సిరీస్ జులై 12వ తేదీ నుంచి జులై 17వ తేదీ వరకు జరగనుంది.
టెస్టు మ్యాచ్ ముగిసిన ఒక్క రోజు వ్యవధిలోనే మొదటి టీ20 ఉండటంతో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు మొదటి టీ20కి విశ్రాంతిని ఇచ్చారు. వీరి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, సంజు శామ్సన్, అర్ష్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్‌లు మొదటి టీ20 ఆడనున్నారు. ఇక వన్డే జట్టుకు శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణలు జట్టులో చోటు సంపాదించారు.
మొదటి టీ20కి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శామ్సన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మలిక్
రెండు, మూడు టీ20లకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మలిక్
మూడు వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్