Team India 2023 Schedule: వచ్చే సంవత్సరం (2023) టీమిండియా బిజీగా గడపనుంది. విరామం లేకుండా వరుసబెట్టి స్వదేశంలో సిరీస్ లు ఆడనుంది. జనవరి నుంచి మార్చి వరకు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో మ్యాచులు ఆడనుంది. మూడు నెలల్లో 4 టెస్టులు, 9 వన్డేలు, 6 టీ20లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. జనవరిలో శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేలతో హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.
భారత్ లో శ్రీలంక పర్యటన 2023
శ్రీలంకతో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి 15వ తేదీ వరకు లంక భారత్ లో పర్యటించనుంది.
జనవరి 3, మొదటి టీ20 ముంబయి
జనవరి 5, రెండో టీ20 పుణె
జనవరి 7, మూడో టీ20 రాజ్ కోట్
జనవరి 10, మొదటి వన్డే గువాహటి
జనవరి 12, రెండో వన్డే కోల్ కతా
జనవరి 15, మూడో వన్డే త్రివేండ్రం
శ్రీలంక తర్వాత టీమిండియా న్యూజిలాండ్ తో సిరీస్ లు ఆడనుంది. ఇవి కూడా 3 వన్డేలు, 3 టీంల సిరీస్. ఇందులో రెండో వన్డే రాయ్ పూర్ వేదికగా జరగనుంది. ఆ నగరం మొట్టమొదటిసారి అంతర్జాతీయ మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వనుంది.
జనవరి 18, మొదటి వన్డే హైదరాబాద్
జనవరి 21, రెండో వన్డే రాయ్ పూర్
జనవరి 25, మూడో వన్డే ఇండోర్
జనవరి 27, మొదటి టీ20 రాంచీ
జనవరి 29, రెండో టీ20 లఖ్ నవూ
ఫిబ్రవరి 1, మూడో టీ20 అహ్మదాబాద్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం మాస్టర్ కార్డ్ ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో టీం ఇండియా 3 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఫిబ్రవరి 9- ఫిబ్రవరి 13, మొదటి టెస్ట్ నాగ్ పూర్
ఫిబ్రవరి 17- ఫిబ్రవరి 21, రెండో టెస్ట్ దిల్లీ
మార్చి 1 - మార్చి 5 , మూడో టెస్ట్ ధర్మశాల
మార్చి 9- మార్చి 13, నాలుగో టెస్ట్ అహ్మదాబాద్
ఆసీస్ తో నాలుగు టెస్టుల తర్వాత మూడు వన్డేల్లో టీమిండియా తలపడుతుంది.
మార్చి 17, మొదటి వన్డే ముంబయి
మార్చి 19, రెండో వన్డే వైజాగ్
మార్చి 22, మూడో వన్డే చెన్నై