Warner Hits Century: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. వార్నర్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో వార్నర్ టెస్ట్ కెరీర్ లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ కొట్టాడు వార్నర్. సెంచరీ కొట్టడం వార్నర్ కు మాములు విషయం కదా అనుకోవచ్చు. కానీ, ఈ మ్యాచ్ అతడికి వందో టెస్ట్ మ్యాచ్. అంటే.. వందవ టెస్ట్ మ్యాచ్ లో... వంద పరుగులు సాధించాడు. దీంతో.. ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అరుదైన ఫీట్ సాధించిన రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా నిలిచాడు.
మెుదటగా రికి పాంటింగ్ తన వందోవ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ కొట్టాడు. తన వందో వన్డే లోనూ వార్నర్ సెంచరీ కొట్టాడు. దీంతో రెండు ఫార్మాట్స్‌లో వందో మ్యాచ్‌లో సెంచరీ వీరుడిగా నిలిచిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇలా వన్డే, టెస్టు ఫార్మాట్‌లో వందో మ్యాచ్‌కు సెంచరీ చేసిన మొదటి ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. గత మూడేళ్లుగా వార్నర్ సెంచరీ కొట్టలేదు. ఈ మ్యాచ్ తో కమ్ బ్యాక్ ఇచ్చినట్లైంది. వార్నర్ తన లాస్ట్ సెంచరీని జనవరి 2020లో చేశాడు. అతను 11 ఇన్నింగ్స్ తర్వాత 2022 ప్రారంభంలో లాహోర్‌లో టెస్ట్‌లో అర్థసెంచరీ చేశాడు. జనవరి 2020 నుంచి అన్ని ఫార్మాట్‌లలో అతనికిది రెండో సెంచరీ. నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అతను ఓ సెంచరీ కొట్టాడు.
100వ టెస్టులో సెంచరీలు సాధించిన ఆటగాళ్ళు
కొలిన్ కౌడ్రీ (ఇంగ్లాండ్) - 1968
జావేద్ మియాందాద్ (పాకిస్థాన్) - 1989
గోర్డాన్ గ్రిన్నిగ్ (విజ్) - 1990
అలెక్ స్టువర్ట్ (ఇంగ్లాండ్) - 2000
ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్) - 2005
రికీ పాంటింగ్ *2 (ఆస్ట్రేలియా) - 2006
గ్రేమ్ స్మిత్ (సాస్క్) - 2012
హషీమ్ ఆమ్లా (సాక్) - 2017
జో రూట్ (ఇంగ్లాండ్) - 2021
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 2022