India vs Pakistan Group 4 Match | దుబాయ్: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ 4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో 2 మార్పులు చోటుచేసుకున్నాయి. పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టుతో చేరారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా సైతం టాస్ గెలిస్తే తాను బౌలింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు.
మళ్లీ అదే రిపీట్ చేసిన సూర్యకుమార్ యాదవ్
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి అదే సీన్ రిపీట్ చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. వారి లీగ్-దశ మ్యాచ్‌లో చేసిన విధంగానే టాస్ నెగ్గిన తరువాత హ్యాండ్ షేక్ చేయకుండా టాస్ నెగ్గి నిర్ణయం ప్రకటించి వెళ్లిపోయాడు. కరచాలనం అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. కానీ సూర్యకుమార్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత భారతదేశం వైఖరిని అంతర్జాతీయ వేదికగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకిస్తూ భారత ఆటగాళ్లు కేవలం గేమ్ మాత్రమే ఆడుతున్నారు. కానీ బీసీసీఐ నుంచి వచ్చిన సూచనతో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదు. ఈ ఎంపిక మునుపటి మ్యాచ్‌లలో ప్రోటోకాల్‌ను అమలు చేయడంలో వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ మ్యాచ్ కు సైతం ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. .
తుది జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సల్మాన్ అఘా(కెప్టెన్), సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
అటు ప్రతీకార జ్వాల.. ఇటు ఆధిపత్యం కోసం
ఆసియా కప్ గ్రూప్ స్టేజీ మ్యాచులో ఓడిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అందులోనూ టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్, మ్యాచ్ ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేయలేదు. ఇది తీవ్ర అవమానంగా పాక్ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న సూపర్ 4 మ్యాచులో నెగ్గాలని పాక్ కసిగా బరిలోకి దిగుతోంది. మరోసారి పాక్ జట్టును ఓడించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
భారత్ హ్యాండ్ షేక్ చేయకపోవడాన్ని అవమానంగా భావించిన పాక్ ఆటగాళ్లు తమ నెక్ట్స్ మ్యాచ్ కు రాకపోవడంతో ఆట గంట ఆలస్యంగా ప్రారంభం కావడం తెలిసిందే. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పై చర్యలు తీసుకోవాలని కోరిన పాక్ కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచుకు సైతం ఆయననే ఐసీసీ రిఫరీగా నియమించింది.