IND vs PAK Asia Cup 2025: భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ 2025 సూపర్-4 దశలో ఆదివారం రాత్రి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు వేస్తారు. ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగే ప్రతి మ్యాచ్ ఫైనల్ తరహాలో అనిపిస్తుంది. ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టేబుల్ టాపర్‌గా నిలవాలంటే బలమైన ప్రత్యర్థిపై కచ్చితంగా విజయం సాధించాలి. అందుకే నేటి మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.

Continues below advertisement


వాతావరణం ఎలా ఉంటుంది


సెప్టెంబర్ 21న UAEలో వాతావరణం సాధారణంగా ఉంది. పొడి వాతావరణం, సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గంటకు దాదాపు 13 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. గల్ఫ్ దేశం కావడంతో దుబాయ్, అబుదాబిలో వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాతావరణం వల్ల మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది  లేదు. నేటి మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?


మబ్బులు లేవు, వాతావరణం క్లియర్ అని వెదర్ నిపుణులు తెలిపారు. ప్రేక్షకులు పూర్తి 40 ఓవర్ల మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఏదైనా కారణం వల్ల మ్యాచ్ పూర్తి కాకపోతే, నిబంధనల ప్రకారం 2 జట్లకు ఒక్కొక్క పాయింట్ లభిస్తుంది. సూపర్-4 దశ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడతారు. ఇందులో ప్రతి జట్టు ఒకరితో మరో జట్టు ఒకసారి తలపడుతుంది. గెలిచిన జట్లకు 2 పాయింట్లు, మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అంటే సూపర్ 4లో ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు ముఖ్యమే. 


భారత జట్టు - సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.   రిజర్వ్ ప్లేయర్లు.. రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా.


పాకిస్తాన్ జట్టు - సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ మొకిమ్.


ఒత్తిడి అదే సమయంలో ఉత్కంఠ 


సూపర్-4 రేసులో ఈ మ్యాచ్ ఆసియా కప్‌లో కీలకం కానుంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సాధారణ మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠ నెలకొంటుంది. అలాంటిది ఆసియా కప్ టోర్నీలో సూపర్ 4 స్టేజ్ కావడంతో మ్యాచ్ హై వోల్టేజ్‌తో ఉంటుంది. గత మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతులు కలపకపోవడం ఉద్రిక్తతను పెంచింది. కాబట్టి ఈరోజు మ్యాచ్ కూడా మరింత డ్రామాగా మారుతుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. గత మ్యాచ్ కు విధులు నిర్వహించిన ఆండీ పైక్రాప్ట్ నేటి మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించనున్నారు. నేడు సైతం ఆటగాళ్లు ఎలాంటి హ్యాండ్ షేక్ చేయరని బీసీసీఐ నుంచి టీంకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.