Asia Cup 2025 IND vs PAK | దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బతీశాడు. 3 వికెట్లు తీయడంతో భారత్ స్పిన్ దాడి ఆశించిన స్థాయిలోనే ఉంది. కుల్దీప్ దాటికి 7 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. అంతకుముందు పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తొలి రెండు ఓవర్లలోనే సాయిమ్ అయూబ్‌ను గోల్డెన్ డక్‌గా, మహ్మద్ హారిస్‌ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా..
తరువాత అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసి పాక్ జట్టును దెబ్బకొట్టాడు. ఫఖర్ జమాన్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను అవుట్ చేయడంతో పాక్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తరువాత కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట మొదలైంది. కుల్దీప్ యాదవ్ ఈ ఊపును కొనసాగిస్తూ, తన ఓవర్ మూడో బంతికి హసన్ నవాజ్‌కు క్యాచ్ మిస్ చేశాడు. కానీ తర్వాతి బంతికే నవాజ్‌ను LBWగా పెవిలియన్ చేర్చాడు. రివ్యూలో బంతి లెగ్ స్టంప్‌లోకి వెళుతున్నట్లు తేలడంతో ఔటయ్యాడు. మరుసటి బంతికే హసన్ నవాజ్ గోల్డెన్ డక్‌గా 0 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయింది. తరువాత 7వ వికెట్ కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఫర్హాన్ ను కూడాకుల్దీప్ ఔట్ చేశాడు. పాక్ జట్టుపై మరింత ఒత్తిడిని పెంచాడు. పాక్ ఓపెనర్ ఫర్హాన్ (44 బంతుల్లో 40 పరుగులు, 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. మరో ఓపెనర్ సయిమ్ ఆయుబ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆష్రఫ్ (11), షాహిన్ షా ఆఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్), ముఖీమ్ (10) పరుగులు చేయకపోతే పాక్ స్కోరు వంద కూడా దాటేది కాదు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా, పాండ్యాల ప్రారంభ వికెట్లతో పాటు అక్షర్, కుల్దీప్‌ల స్పిన్ దాడితో భారత్ వేగం, స్పిన్‌ల కలయిక ఈ పోటీని పూర్తిగా తమ వైపు తిప్పుకుంది. పాకిస్తాన్ లోయర్ ఆర్డర్ శ్రమించడంతో పాక్ వంద పరుగులు దాటించింది.
బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్
టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో కూడిన తమ ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. IND vs PAK మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతికి గాయమైనప్పటికీ బ్యాటింగ్ లైనప్ మారలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని సంజు శాంసన్, పాకిస్తాన్ బౌలింగ్ దాడిని ఎదుర్కోవాలని సిద్ధంగా ఉన్నాడు.
మరోవైపు, పాకిస్తాన్ కూడా ఈ హై-స్టేక్స్ ఎన్‌కౌంటర్ కోసం స్పిన్-హెవీ వ్యూహంతో ముందుకు సాగింది. హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఇటీవల ప్రస్తుత ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పేర్కొన్న మహ్మద్ నవాజ్‌పై అందరి దృష్టి ఉంది, ఈ కీలకమైన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో భారత్‌ను సవాలు చేయడానికి జట్టు చూస్తోంది.