Asia Cup 2025 Final: ఆసియా కప్‌లో ప్రస్తుతం సూపర్ 4 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన, శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. తర్వాత మ్యాచ్ శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయి.
ఏసీసీ ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పోటీ పడితే నాలుగు జట్లు సూపర్ 4కు చేరుకున్నాయి. ఇప్పుడు ఇందులో విజయం సాధించిన టాప్2 జట్లు ఫైనల్‌కు వెళ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది.
అపజయం లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా సూపర్ 4లో మిగతా మూడు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడబోతోంది. ఆ మూడింటిలో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. వేరే జట్ల జయాపజయాలపై కూడా భారత్ అంతకంటే ముందే ఫైనల్‌కు చేరుకోవచ్చు.
ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ?
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. దుబాయ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ వేదికపై చాలా మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా అక్కడే జరిగాయి.
ఆసియా కప్ ఫైనల్ ఎప్పుడు?
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న ఆదివారం నాడు జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
పాయింట్ పట్టికలో ఎవరు టాప్‌లో ఉన్నారు?
ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు సూపర్ 4లో జరిగాయి. ఇందులో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ శ్రీలంకపై విజయం సాధించింది. తర్వాత జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఈ జట్లే ఉన్నాయి. అయిన రేపటి నుంచి జరిగే మ్యాచ్‌లను బట్టి కూడా ఈ స్థానాలు మారవచ్చు.
ఆసియా ఫైనల్ మ్యాచ్ ఎక్కడ లైవ్ చూడాలి
ఆసియాకప్‌లోని అన్ని మ్యాచ్‌లు మాదిరిగానే ఫైనల్ మ్యాచ్ కూడా సోనీలివ్ యాప్, ఛానల్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు మాత్రమే ఈ మ్యాచ్‌లను లైవ్ చూడగలరు.