Abhishek Sharma fastest Indian to score Half Century: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్లో వీర విహారం చేశాడు. ఆదివారం రాత్రి పాక్‌తో జరిగిన మ్యాచులో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో తొలి బంతికే సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికి రెండు మ్యాచ్‌లలో సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

Continues below advertisement

అభిషేక్ నిన్నటి IND vs PAK మ్యాచులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ భారత బ్యాట్స్‌మన్ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో పాకిస్తాన్ మీద అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కుగానూ అభిషేక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తన గురువు యువరాజ్ రికార్డును కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన టాప్ 5 ఆటగాళ్లు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ళు

భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ హై-వోల్టేజ్ పోరు తప్పదు. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు భారీ పరుగుల కోసం ప్రయత్నిస్తారు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ శతకాలు బాదిన ఆటగాళ్లలో 2 దేశాల బ్యాటర్లు ఉన్నారు. ఈ జాబితాలో మహ్మద్ హఫీజ్ నెంబర్ వన్ గా ఉన్నాడు.

మహమ్మద్ హఫీజ్ (Mohammad Hafeez)

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన రికార్డు పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ హఫీజ్ పేరిట ఉంది. హఫీజ్ 2012లో అహ్మదాబాద్ వేదికగా 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

అభిషేక్ శర్మ (Abhishek Sharma)

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అభిషేక్ పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో 74 పరుగులు చేశాడు. అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

యువరాజ్ సింగ్ (Yuvraj Singh)

భారత ఆల్ రౌండర్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. యువరాజ్ 2012లో అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  29 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. 

ఇఫ్తిఖర్ అహ్మద్ (Iftikhar Ahmed)

పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఇఫ్తిఖర్ 2022లో మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. 

మిస్బా ఉల్ హక్ (Misbah-ul-Haq)

పాకిస్తాన్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. 2007లో డర్బన్లో జరిగిన మ్యాచులో మిస్బా 33 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.

అభిషేక్ శర్మ రికార్డులు..పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్లు రెండు మ్యాచులలో కొట్టిన తొలి భారత బ్యాటర్ అభిషేక్. దాంతో పాటు అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ కూడా ఇతడే. టీ20ల్లో ఎదుర్కొన్న అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్స్‌లు బాదిన రికార్డు సాధించాడు. తాను ఎదుర్కొన్న 331 బంతుల్లో అభిషేక్‌ శర్మ 50 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్‌ బ్యాటర్ ఎవిన్‌ లూయిస్‌ (366 బంతుల్లో) పేరిట ఉండేది. ఈ జాబితాలో 3వ స్థానంలో రస్సెల్‌, 5వ స్థానంలో భారత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు.