Asia Cup 2023 Final: ఆసియా కప్ - 2023లో భాగంగా ఆదివారం భారత్ - శ్రీలంకలు తుది పోరులో తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే గడిచిన పది రోజులుగా కొలంబోలో కురుస్తున్న వర్షం నేటి మ్యాచ్‌కూ ముప్పును కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సూపర్ - 4లో వరుణుడు అంతరాయం కలిగించని మ్యాచ్ లేదంటే అతిశయోక్తి కాదు. భారత్ - పాక్ మధ్య గత ఆదివారం జరిగిన మ్యాచ్ రెండు రోజుల పాటు జరిగిన విషయం మరిచిపోరాదు. కొన్ని మ్యాచ్‌లు ఓవర్ల కుదింపునకు లోనయ్యాయి. మరి నేటి ఫైనల్ సంగతి ఏంటి..?
తాజా వాతావరణ సమాచారం ప్రకారం.. కొలంబోలో ఆదివారం వర్షాలు కురిసే అవకాశాలు ఏకంగా 80 శాతం దాకా ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఏడు గంటల వరకూ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే రాత్రి 7.30 గంటల తర్వాత వర్షాలు పడే అవకాశం 70 శాతం దాకా ఉంది. సూపర్ - 4లో వరుణుడు ప్రతి మ్యాచ్‌లో రాత్రి తన ప్రతాపాన్ని చూపాడు. నేటి మ్యాచ్‌లో కూడా అదే రిపీట్ కానుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రిజర్వ్ డే ఉందా..?
ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తే కనీసం దానిని 20 ఓవర్ల మ్యాచ్ కింద అయినా ఆడించాలని ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 17న భారత్ - లంక మ్యాచ్ వర్షార్పణం అయితే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్‌ను జరిపిస్తారు. ఒకవేళ ఆదివారం సాధ్యం కాకుంటే ఆసియా కప్ - 2023 ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఆదివారం వీలు కాకుంటే సోమవారం అయినా మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి. ఒకవేళ సోమవారం కూడా వరుణుడు ఆడే అవకాశం ఇవ్వకుంటే మాత్రం ఇక అప్పుడు భారత్ - లంకలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
వాస్తవానికి ఆసియా కప్ - 2023లో ఫైనల్ ఒక్క మ్యాచ్‌కే రిజర్వ్ డే ఉండేది. కానీ భారత్ - పాక్ మధ్య గ్రూప్ స్టేజ్‌లో పల్లెకెలెలో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) దాయాదుల మధ్య గత ఆదివారం జరిగిన సూపర్ - 4 మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్:
- కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆడే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.
లైవ్ చూడండిలా..
- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో అయితే స్టార్ నెట్‌వర్క్స్ ఛానెల్స్‌లో చూడొచ్చు. ఇక మొబైల్ యాప్, వెబ్‌సైట్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్ నుంచి ఉచితంగా వీక్షించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial