Ashes 2023: టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన దశాబ్ద కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కంగరూల విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఖవాజా.. తొలి ఇన్నింగ్స్‌లో 141 రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఖవాజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఐదు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
టెస్టులలో ఐదు రోజులూ బ్యాటర్‌గా కనీసం ఒక్క బంతిని అయినా ఎదుర్కున్న ఆటగాళ్ల జాబితాలో ఖవాజా 13వ వాడు. గతంలో ఈ రికార్డు సాధించినవారి జాబితాలో దిగ్గజ క్రికెటర్లే ఉన్నారు. ఆ జాబితాను ఓసారి పరిశీలిస్తే..
ఇండియా నుంచి - ఎంఎల్ జయసింహ, రవిశాస్త్రి, ఛటేశ్వర్ పుజారా
ఇంగ్లాండ్ నుంచి - జెఫ్రీ బాయ్‌కాట్, అలియన్ లంబ్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రోరీ బర్న్స్,
సౌతాఫ్రికా నుంచి - అల్విరో పీటర్సన్
వెస్టిండీస్ నుంచి - ఆడ్రియన్ గ్రిఫిత్, టి. చందర్‌పాల్, క్రెయిగ్ బ్రాత్‌వైట్
ఆస్ట్రేలియా నుంచి - కిమ్ హ్యూగ్స్, ఉస్మాన్ ఖవాజా
ఆ ఐదు రోజులు ఇలా..
- తొలి రోజు.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ 78 ఓవర్లు బ్యాటింగ్ చేసి డిక్లేర్ ఇచ్చింది. ఇదే రోజు ఆసీస్ బ్యాటింగ్‌కు వచ్చి నాలుగు ఓవర్లు ఆడింది. తొలి రోజు ఖవాజా నాలుగు పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.
- రెండో రోజు.. ఈ రోజంతా బ్యాటింగ్ చేసిన ఖవాజా.. 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
- మూడో రోజు.. తన ఓవర్ నైట్ స్కోరు 130 వద్ద బ్యాటింగ్‌కు దిగిన ఖవాజా.. మూడో రోజు ఉదయం సెషన్‌లో మరో 11 పరుగులు జోడించి ఔటయ్యాడు.
- నాలుగో రోజు.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులుకు ఆలౌట్ కావడంతో చివరి సెషన్‌లో ఆసీస్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఖవాజా 34 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
- ఐదో రోజు.. 34 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు క్రీజులోకి వచ్చిన మరో 31 పరుగులు జోడించాడు. తద్వారా అతడు ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
బాయ్‌కాట్ తర్వాత అతడే..
పైన పేర్కొన్న 13 మంది ఆటగాళ్ల జాబాతాలో ఐదు రోజులు బ్యాటింగ్ చేసినా వాళ్ల జట్లు గెలిచింది మాత్రం రెండు సందర్భాలలోనే.. 1977 లో జెఫ్రీ బాయ్‌కాట్ యాషెస్ సిరీస్‌లో భాగంగానే ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 107, రెండో ఇన్నింగ్స్ లో 80 రన్స్ చేశాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌నే విజయం వరించింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కూడా ఇంగ్లాండ్‌పై ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial