Arundhati Reddy and Sree Charani in India Women ODI World Cup squad: 2025లో జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ఖరారు చేసింది. సెప్టెంబర్ 30న ప్రారంభం కానున్న ఎనిమిది దేశాల టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతేకాకుండా, ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు.

ఊహించినట్లుగానే, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధాన  వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ పోటీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ మ్యాచ్‌లు శ్రీలంకలోని కొలంబోలో జరుగుతాయి. మిగతా మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతాయి. 

ప్రస్తుతం ఇండియా ఎ vs ఆస్ట్రేలియా ఎ సిరీస్‌లో ఆడుతున్న బ్యాటర్ షఫాలి వర్మ జట్టు నుంచి తప్పించారు. బౌలింగ్ పరంగా టైటాస్ సాధు మహిళల ప్రపంచ కప్‌కు ఎంపిక చేయలేదు. ఆమెకు బదులుగా క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, శ్రీ చరణి వంటి అనేక మంది యువ ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చారు. 

అనుభవ పరంగా దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా స్పిన్ దాడికి నాయకత్వం వహిస్తారు. యాస్టికా భాటియా కూడా రెండో వికెట్ కీపర్‌గా తిరిగి వచ్చింది. రిచా ఘోష్  మొదటి వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యారు.  

ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం భారత జట్టు ఇదే

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైఎస్‌ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి(తెలంగాణ), రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి(ఆంధ్రప్రదేశ్‌), యాస్టికా భాటియా (వికెట్ కీపర్) స్నేహ్ రాణా.

ఆస్ట్రేలియా వన్డేలకు భారత మహిళా జట్టు

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ప్రపంచ కప్ జట్టుతోపాటు జట్టును ప్రకటించారు. రెండు లైనప్‌ల మధ్య ఉన్న ఏకైక మార్పు సయాలీ సత్‌ఘరేvg ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేశారు. ఎందుకంటే ఆమెకు ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించలేదు. ఆసక్తికరంగా భారత్‌లో విజయవంతమైన U-19 T20 ప్రపంచ కప్ జట్టు నుంచి ఒక్క సభ్యురాలిని కూడా ఎంపిక చేయలేదు.

భారత్ వర్సెస్ ఆసీస్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (VC), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతీ రెడ్డి, రిచా ఘోష్ (WK), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్‌, శ్రీచరణి, యాస్టికా భాటియా (వికెట్ కీపర్) స్నేహ్ రాణా