Annabel Sutherland records fastest double hundred in womens Test cricket: మహిళల టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ అనాబెల్‌ సథర్‌లాండ్‌(Annabel Sutherland) అత్యంత వేగంగా ద్వి శతకం సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. కేవలం 248 బంతుల్లో డబుల్‌ సెంచరీ కొట్టేసింది. ఇందులో 27 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆస్టేలియా మాజీ ప్లేయర్‌ కారెన్‌ రాల్టన్‌ 306 బంతుల్లో చేసిన డబుల్‌ సెంచరీని బద్దలు కొట్టింది. అనాబెల్‌ ద్వి శతక మోతతో  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా 575/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనాబెల్‌తో పాటు కెప్టెన్‌ అలీసా హీలీ (99), ఆష్లే గార్డ్‌నర్‌ (65), బెత్‌ మూనీ (78) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 వేలంలో అనాబెల్ సదర్లాండ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.



అందరిచూపు WPL వైపే
బీసీసీఐ(BCCI) ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ (WPL)పైనా దృష్టి పెట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) రెండో సీజన్‌ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించ‌నున్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్, యూపీ వారియ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య ఫిబ్రవ‌రి 24న‌ రెండో మ్యాచ్ జ‌రుగునుంది. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి.  ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. తొలి సీజ‌న్‌లో ముంబైకే ప‌రిమిత‌మైన డ‌బ్ల్యూపీఎల్‌.. రెండో సీజ‌న్‌లో రెండు న‌గ‌రాల్లో జ‌రుగ‌నుంది.
WPL 2024 షెడ్యూల్‌....
ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ v ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగుళూరు)
మార్చి 5- ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 8- ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 10- ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 13- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ)