Hyderabad Women Cricketers Coach Jai Simha: హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో మద్యం సేవిస్తూ క్రీడాకారిణులను దుర్భాషలాడారంటూ ఈ-మెయిల్ లో వచ్చిన పిర్యాదు ఆధారంగా హైదరాబాద్ మహిళా క్రికెట్ కోచ్ విద్యుత్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) వేటు వేసింది. ఆయనను తక్షణం పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. గతనెల విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన హైదరాబాద్ మహిళల జట్టు తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉంది. అయితే విద్యుత్ జైసింహా జాప్యం చేయడంతో.. బస్సులో హైదరాబాద్ బయలుదేరింది. ఈ సమయంలోనే బస్సులో మద్యం సేవించిన విద్యుత్ జైసంహా మహిళా క్రికెటర్లను బండ బూతులు తిట్టారంటూ ఈనెల 12న HCAకు ఓ ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి మౌనంగానే ఉన్న HCA మహిళా క్రికెటర్ల బస్సులో విద్యుత్ జైసింహా ఏదో సేవిస్తున్నట్టు ఉన్న వీడియోలు, టీవీ ఛానెళ్లలో ప్రత్యక్షం కావడంతో రంగంలో దిగింది. తక్షణం విద్యుత్ జైసంహాపై వేటు వేస్తున్నట్టు HCA అధ్యక్షుడు జ గ న్ మోహ న్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. 



ఖండించిన జై సింహా
 అటు తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహా ఖండించారు.తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఈ వేధింపుల ఆరోపణలపై కోచ్ జై సింహా స్పందించాడు. తానూ ఎటువంటి తప్పు చేయలేదన్న జై సింహా.. ఎలాంటి విచారణ చేయకుండా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే.. తాను బస్సులో మద్యం సేవించలేదని.. వైరల్ అవుతున్న వీడియోలో తాను తాగుతుంది కేవలం కూల్ డ్రింక్ మాత్రమేనని వివరించారు. తాను ఎవరినీ వేధించలేదని చెప్పుకొచ్చారు. హెచ్‌సీఏ తనను సస్పెండ్ చేసిందని... ఎలాంటి విచారణ చేయకుండా తనపై ఎలా చర్యలు తీసుకుంటారంటూ జై సింహా ప్రశ్నించారు. 


మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని HCA సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ తెలిపారు. జై సింహా వెనకాల హెచ్‌సీఏలోనే కొంత మంది ఉన్నారని ఆరోపించారు. ఇంటర్నల్ కమిటీలో జై సింహాపై కనీసం విచారణ జరపలేదన్నారు. ప్రభుత్వం మహిళలకు క్రీడల్లో మంచి అవకశాలు ఇస్తుందని.. కానీ ఇలాంటి చర్యలు చూస్తే ఏ తల్లిదండ్రులు మహిళను క్రీడలకు పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జై సింహాపై ఎప్పుడు ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జై సింహాను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదని.. ఇలాంటి వారిపై ప్రభుత్వం చొరవ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. HCAకి మహిళా క్రికెటర్ల భద్రతపై ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణం.. జైసింహపైన, పూర్ణిమారావుపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణం వారిని బ్యాన్ చేయాలని కోరుతున్నారు.