R Ashwin dedicates 500 Test wickets to his father: రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్‌.. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఆస్థాయి స్పిన్నర్‌గా ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఈ 500 వికెట్ల ఘనతను అశ్విన్‌ ప్రత్యేకమైన వ్యక్తికి అంకితం ఇచ్చాడు.

 

ఎవరికీ అంకితమిచ్చాడంటే..

రెండో రోజు ఆట అనంతరం మాట్లాడిన అశ్విన్.. 500ల టెస్టు వికెట్‌ను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు వెల్లడించాడు. అశ్విన్ 500 వికెట్ల పడగొట్టడంపై టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు, ప్రస్తుత ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, దినేశ్ కార్తిక్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞాన్ 

 

తొమ్మిదో బౌలర్‌గా అశ్విన్‌

సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా యాష్.. రికార్డు సాధించాడు. ఈ జాబితాలో భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే.. అశ్విన్ కంటే ముందున్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 9 మంది బౌలర్లు 500 వికెట్లు పడగొట్టారు. 

 

టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు

ముత్తయ్య మురళీధరన్ 133 మ్యాచుల్లో 800 వికెట్లు

షేన్ వార్న్ 145 మ్యాచుల్లో 708 వికెట్లు 

జేమ్స్ అండర్సన్ 185 మ్యాచుల్లో 696 వికెట్లు

అనిల్ కుంబ్లే 132 మ్యాచుల్లో 619 వికెట్లు

స్టువర్ట్ బ్రాడ్ 167 మ్యాచుల్లో 604 వికెట్లు

గ్లెన్ మెక్ గ్రాత్  124 మ్యాచుల్లో 563 వికెట్లు

కోర్ట్నీ వాల్ష్ 132 మ్యాచుల్లో 519 వికెట్లు

నాథన్‌ లయన్ 127 మ్యాచుల్లో 517 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్ 98 మ్యాచుల్లో 500 వికెట్లు

బంతుల పరంగా చూస్తే.. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. అశ్విన్ 25,714 బంతులు విసిరి ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ఉన్న మెక్‌గ్రాత్.. అశ్విన్ కంటే సుమారు 200 బంతులు ముందుగానే 500 వికెట్ల ఘనత సాధించాడు. మ్యాచుల పరంగా చూసినా అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న రెండో బౌలర్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ 87 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించాడు. అశ్విన్ 98 మ్యాచుల్లో 500 వికెట్లు తీశాడు.