Sachin’s Early Romance Exposed: క్రికెడ్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin) జెంటిల్మెన్. సచిన్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. తాను అవుట్ కాకపోయినా అంపైర్ వేలు పైకెత్తితే చాలు.. వెంటనే పిచ్‌ను వీడడం సచిన్ నైజానికి నిదర్శనం. అందుకే సచిన్‌కు మైదానంలోనే కాకుండా బయట కూడా చాలామంది అభిమానులు ఉంటారు. ఎంతో మంది క్రికెటర్లు ఈ క్రికెట్ గాడ్‌ను ఓ దైవంగా భావిస్తారు. అందుకే భారత్‌లో క్రికెట్ ఒక మతమైతే సచిన్ ఓ దేవుడని చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి దిగ్గజ క్రికెటర్ సచిన్ గురించి.. ఆమె అత్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో సచిన్ ప్లే బాయ్ అవుతాడేమోనని చాలా భయపడ్డానని టెండూల్కర్ అత్త అన్నా బెల్లి మెహతా అన్నారు.
19 ఏళ్ల వయసులోనే సచిన్ తన కుతురు అంజలికి పెళ్లి ప్రపోజ్ చేశాడని.. వయసులో సచిన్ కంటే ఆమె పెద్దదని... సచిన్ అలా చేసే సరికి అతడు పెద్ద ప్లే బాయ్ అవుతాడని భయమేసిందని అన్నాబెల్లి తెలిపారు. మై ప్యాసేజ్ టు ఇండియా అనే బుక్ రాసిన ఆమె దాని ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్లే బాయ్ అవుతాడని తాను భయపడ్డ సచినే క్రికెడ్ గాడ్ అయ్యాడని అన్నా బెల్లి మెహతా ఆనందం వ్యక్తం చేశారు.
అమ్మో చాలా భయపడ్డా...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అత్త, అంజలీ తల్లి అన్నాబెల్లి మెహతా.. మై ప్యాసేజ్ టు ఇండియా అనే బుక్ రాశారు. ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నాబెల్లి చాలా విషయాలపై మాట్లాడారు. ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తన కూతురు అంజలికి సచిన్ టెండూల్కర్ కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రపోజ్ చేశాడని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులో సచిన్ ప్రపోజ్ చేయడం చూసి ఎక్కడ సచిన్ ప్లే బాయ్ అయిపోతాడో అని చాలా భయపడ్డానని అంజలి అత్తా అన్నారు. సచిన్ టెండూల్కర్.. వయసులో పెద్ద అయిన అంజలీని వివాహం చేసుకోవాలని ప్రపోజ్ చేశాడని తెలిసి చాలా సేపు తాను ఏం మాట్లాడలేకపోయానని అన్నాబెల్లి తెలిపారు.
అంతా రహస్యమే...
టెండూల్కర్-అంజలీ నిశ్చితార్థాన్ని కూడా చాలా రహస్యంగా జరిగేలా చూసేందుకు చాలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అన్నాబెల్లి మై ప్యాసేజ్ టు ఇండియా బుక్‌లో పేర్కొన్నారు. సచిన్ తన కూతురుకి ప్రపోజ్ చేసిన సమయంలో అతను అప్పుడప్పుడే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడని గుర్తు చేసుకున్నారు. అలా ఎదుగుతున్న సచిన్ అందరి క్రికెటర్లలాగానే ఎక్కడ ప్లేబాయ్ అవుతాడో అని చాలా భయపడ్డట్లు కూడా అన్నాబెల్లి ఆ పుస్తకంలో రాశారు. 90వ దశకంలో ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్‌కు ఉన్నట్లే సచిన్‌కు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు. తన కూతురు గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని సచిన్‌ను అడిగితే.. టెండూల్కర్ సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడని అది తనను షాక్‌కు గురి చేసిందని అన్నాబెల్లి గుర్తు చేసుకున్నారు.