India vs England Test: తుది జట్టులోకి ఆకాశ్‌దీప్‌, సెలెక్టర్ల చూపు అతడి వైపే

Akash Deep: నాలుగో టెస్ట్‌ నుంచి టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రాకు విశ్రాంతి లభించడంతో బెంగాల్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఆకాశ్‌దీప్‌రాంచి టెస్టులో అరంగేట్రం చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి.

Continues below advertisement
Uncapped Pacer Akash Deep Impresses At Nets: నాలుగో టెస్ట్‌ నుంచి టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రాకు విశ్రాంతి లభించడంతో బెంగాల్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ రాంచిలో జరిగే నాలుగో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. సిరాజ్‌తోపాటు పేస్‌ బాధ్యతలను పంచుకునేందుకు ఈ యంగ్‌ స్టార్‌ సిద్ధంగా ఉన్నాడు. అయితే ముకేశ్‌ కుమార్‌తో ఆకాశ్‌దీప్‌కు పోటీ నెలకొంది. కానీ జట్టు మేనేజ్‌మెంట్‌ ఆకాశ్‌దీప్‌ వైపే మొగ్గుచూపొచ్చు. భారత్‌-ఎ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లను ఆకట్టుకుంది. లయన్స్‌తో రెండు మ్యాచ్‌ల్లో అతడు పది వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్‌ ఇప్పటివరకు 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 104 వికెట్లు చేజిక్కించుకున్నాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో 12 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ముకేశ్‌.. ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగాడు. 

నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరం, రాహుల్ కూడా
రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ర్పిత్‌ బుమ్రా(Bumrah) ఆడడం లేదు. పని భారం ఎక్కువ అవుతుండడంతో  కీలకమైన నాలుగో టెస్ట్‌కు  బుమ్రాకు  విశ్రాంతి ఇచ్చారు. బుమ్రాను నాలుగో టెస్ట్‌లో జట్టులోకి తీసుకోలేదని... టెస్టు సిరీస్‌ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రకటించింది. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రాంచీ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ టెస్టు బరిలోకి దిగుతాడనుకున్న కేఎల్‌ రాహుల్‌(K L Rahul) కూడా జట్టుకు దూరమైనట్టు బోర్డు తెలిపింది. రాహుల్‌ ఐదో టెస్టులోనూ ఆడేది లేనిది అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు వెల్లడించింది. కేఎల్‌ రాహుల్‌ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే ఆఖరి టెస్టులో ఆడతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం రాంచీలో ఆరంభమయ్యే నాలుగో టెస్టు కోసం బుమ్రా స్థానంలో ముకేశ్‌ కుమార్‌ జట్టుకు ఎంపికయ్యాడు.  బుమ్రా 17 వికెట్లతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో 80 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. 

Continues below advertisement

భద్రత కట్టుదిట్టం
నాలుగో టెస్టు మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తానంటూ అమెరికా ఉగ్ర‌వాది గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నున్(Terrorist Pannun) వార్నింగ్ నేప‌థ్యంలో ఇంగ్లండ్‌(England), ఇండియా(India) మ‌ధ్య రాంచీ(Ranchi)లో  భ‌ద్ర‌త‌ను పెంచారు. ఇండ్లండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగే టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాల‌ని అత‌ను సోష‌ల్ మీడియాలో ఓ వీడియోలో అప్‌లోడ్ చేశాడు. మ్యాచ్‌ను అడ్డుకోవాలంటూ ఆయ‌న సీపీఐ ద‌ళాన్ని కోరారు.  బెదిరింపుల నేపథ్యంలో జార్ఖండ్ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జేఎస్సీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ది. మంగ‌ళ‌వార‌మే ఇంగ్లండ్ జ‌ట్టు రాంచీ చేరుకున్న‌ది. 

Continues below advertisement