Ajinkya Rahane Lifts Ranji Trophy as Mumbai Win Record extending Title: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తమకు ఎదురులేదని ముంబై మరోసారి  చాటిచెప్పింది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో విద‌ర్భను మ‌ట్టిక‌రిపించి 8 ఏళ్ల త‌ర్వాత ముంబై టైటిల్‌ను ముద్దాడింది. చివరిసారిగా 2015-16 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించి ముంబై ఛాంపియన్‌ అయింది. ఫైనల్లో భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా విదర్భ పోరాటం ఆకట్టుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కప్పును అందుకున్న అనంతరం ముంబై కెప్టెన్‌ అజింక్యా రహాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


రహానే ఏమన్నాడంటే..? 
 రంజీ ట్రోఫీలో తమ జట్టులో తక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌ను తానేనని..రంజీ ట్రోఫీని అందుకోవడంతో ఎక్కువగా సంతోషపడే ఆటగాడిని కూడా తానేనని ముంబై కెప్టెన్‌ రహాన్‌ అన్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం కల్పించడం చాలా ముఖ్యమని... తాము ఆ పని చేయడంలో సఫలమయ్యామని వివరించాడు. గతేడాది మేం నాకౌట్‌ దశకు అర్హత సాధించడంలో విఫలమయ్యాంమని... కానీ, ఈసారి మాత్రం జట్టులోని ప్రతిఒక్కరూ రాణించారని రహానే వెల్లడించాడు. ఫైనల్‌లో విదర్భ చాలా బాగా పోరాడింది. కానీ తమ బౌలర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా జట్టును విజయతీరాలకు చేర్చారని రహానె వ్యాఖ్యానించాడు.


రంజీ ఛాంపియన్‌ ముంబై
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తమకు ఎదురులేదని ముంబై మరోసారి  చాటిచెప్పింది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో విద‌ర్భను మ‌ట్టిక‌రిపించి 8 ఏళ్ల త‌ర్వాత ముంబై టైటిల్‌ను ముద్దాడింది. చివరిసారిగా 2015-16 సీజన్‌లో సౌరాష్ట్రను ఓడించి ముంబై ఛాంపియన్‌ అయింది. ఫైనల్లో భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా విదర్భ పోరాటం ఆకట్టుకుంది. 
ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 350/5 స్కోరుతో విజయం దిశగా సాగిన విదర్భను ముంబయి బౌలర్లు కట్టడి చేయగలిగారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి జట్టును గెలిపించారు. విదర్భ కెప్టెన్ అక్షయ్ వడ్కర్ సెంచరీ సాధించి జట్టును గెలిపించేందుకు చివరి వరకూ పోరాడాడు. ముంబై బౌలర్లు తనుష్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్‌ దేశ్‌ పాండే 2.. శార్దూల్, షామ్స్‌ ములాని చెరో వికెట్‌ తీశారు. సెంచ‌రీ హీరో ముషీర్ ఖాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. ముంబై బౌలర్‌ త‌నుష్ కొటియాన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరపున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అద్భుత శతకంతో ముంబైకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. 326 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్‌ 10 ఫోర్లతో 136 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు తీసుకున్నాడు.