AFG vs SL:


ఆసియాకప్‌ -2023లో ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌కు వేళైంది. లాహోర్‌ వేదికగా అఫ్గానిస్థాన్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన శ్రీలంక సారథి దసున్ శనక మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.


'మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. ముందే పరుగులు చేస్తే ఒత్తిడి ఉండదు. మేం మంచి క్రికెట్‌ ఆడాం. మేమీ మ్యాచ్‌ తప్పక గెలవాలి. బ్యాటు, బంతితో సరిగ్గా ఆడాలి. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు' అని శ్రీలంక కెప్టెన్‌ దసున్ శనక అన్నాడు.


'నిజాయతీగా చెప్తున్నా! మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం. ఎందుకంటే ఛేదన సమయంలో నెట్‌రన్‌రేట్‌ కీలకం అవుతుంది. సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తాం. సానుకూలంగా క్రికెట్‌ ఆడతాం. మేం కూడా సేమ్‌ టీమ్‌తో ఆడుతున్నాం' అని అఫ్గానిస్థాన్‌ సారథి హస్మతుల్లా షాహిది పేర్కొన్నాడు.


శ్రీలంక: పాథుమ్‌ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్‌ మెండి్‌, సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్‌ వెల్లలగె, మహీశ్‌ థీక్షణ, కసున్‌ రజిత, మతీశ పతిరణ


పిచ్‌ రిపోర్ట్‌: ఈ మ్యాచ్‌ లాహోర్‌లో జరుగుతోంది. పిచ్‌ బాగుంది. 300 పరుగులు చేయొచ్చు. చివరి మ్యాచ్‌తో పోలిస్తే వికెట్‌పై నెర్రలు వాసాయి. మొదట బ్యాటింగ్‌ చేసే శ్రీలంక వికెట్‌ను ఆస్వాదిస్తుందని దీప్‌దాస్ గుప్తా అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి స్కిడ్‌ అవుతుందన్నాడు.


ఆసియాకప్ -2023లో అఫ్గానిస్థాన్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచూ గెలవలేదు. దాంతో గ్రూప్‌లో వెనకబడింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే తప్ప సూపర్‌ 4 ఆడేందుకు అవకాశం ఉండదు. ఈ పోరులో మొదట 300 పరుగులిచ్చి 76 బంతుల తేడాతో టార్గెట్‌ను ఛేదిస్తే పఠాన్లు తర్వాతి దశకు చేరుకుంటారు.


అఫ్గాన్ ఎలా గెలవాలంటే..?


రెండ్రోజుల క్రితం  లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఓడిన అఫ్గానిస్తాన్‌కు  నేడు లంకతో జరుగబోయే మ్యాచ్ అత్యంత కీలకం.  గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో  శ్రీలంక ఒక్క మ్యాచ్ ఆడి   గెలిచి  రెండు పాయింట్లతో  టాప్ పొజిషన్‌లో ఉంది.  బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో ఓడి మరోదాంట్లో గెలిచి  రెండు పాయింట్లతో లంకతో సమానంగా ఉంది.  కానీ అఫ్గాన్  ఒక్క మ్యాచ్ ఆడి  అందులో ఓడింది.   ఈ మ్యాచ్ ‌లో గెలిచినా అఫ్గాన్ ఖాతాలో రెండు పాయింట్లే చేరతాయి.  


నెట్ రన్ రేట్ విషయంలో అఫ్గాన్ (-1.780) పరిస్థితి మిగిలిన జట్లతో పోలిస్తే దారుణంగా ఉంది. శ్రీలంక (+0.951), బంగ్లాదేశ్ (+0.373)లు మెరుగ్గానే ఉన్నాయి.  నేటి మ్యాచ్‌లో అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం  275 పరుగులు చేసి  ఆ తర్వాత లంకపై 70 పరుగుల తేడాతో గెలవాలి. అలా కాకుండా తొలుత  బౌలింగ్ చేస్తే లంక విధించే ఎంత టార్గెట్‌ను అయినా  35 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు  అఫ్గాన్ జట్టు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అయితే లంకకు ఈ లెక్కలన్నీ అవసరం లేదు గానీ  సూపర్ - 4 రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాలి.  ఓడితే భారీ తేడా లేకుండా చూసుకున్నా ఆ జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.