Womens Premier League 2024 Auction: వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలం విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి(Feb-March)లో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ముంబయి (Mumbi)వేదికగా జరిగిన ఈ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఆస్ట్రేలియా.. భారత క్రీడాకారిణులకు భారీ ధర పలికింది. మొత్తం 165 మందిలో 104 మంది భారత(Indian) క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో పాల్గొన్నారు.  ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు.

నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. వీరిలో అత్యధికంగా గుజ‌రాత్ జెయింట్స్ 10 మంది, ఆర్‌సీబీ ఏడు మందిని, ముంబై ఇండియ‌న్స్ అయిదుగురిని, ఉత్తరప్రదేశ్‌ వారియర్స్ అయిదుగురిని, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముగ్గురు ప్లేయ‌ర్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్ల‌కు ద‌క్కించుకోగా, అన్‌క్యాప్‌డ్ కేటగిరీలో భారత్‌కు చెందిన కాష్వీ గౌతమ్‌ను గుజరాత్ టైటాన్స్‌లో రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రాంచైజీలు దక్కించుకున్న మొత్తం ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

 

భార‌త్‌కు చెందిన కష్వీ గౌతమ్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

 

ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ బేస్ ప్రైజ్ రూ.40 ల‌క్ష‌లు కాగా.. రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

 

భార‌త్‌కు చెందిన వ్రిందా దినేష్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.1.3 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

 

ద‌క్షాణాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ బేస్ ప్రైజ్ రూ.40 లక్షలు కాగా.. రూ.1.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

 

ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. గుజరాత్ జెయింట్స్ రూ.1 కోటికి సొంతం చేసుకుంది.

 

భార‌త్‌కు చెందిన ఏక్తా బిష్త్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. రూ.60 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొనుగోలు చేసింది.

 

ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వారేమ్ బేస్ ప్రైజ్ అయిన రూ.40 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన డాని వ్యాట్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.  భార‌త్‌కు చెందిన వేదా కృష్ణమూర్తి బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఎస్ మేఘన బేస్ ప్రైజ్ అయిన రూ. 30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది. భార‌త్‌కు చెందిన మేఘనా సింగ్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. భార‌త్‌కు చెందిన సిమ్రాన్ బహదూర్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన కేట్ క్రాస్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన గౌహెర్ సుల్తానా బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యుపి వారియర్స్ దక్కించుకుంది.

 

ఆస్ట్రేలియాకు చెందిన లారెన్ చీటిల్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్షలకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సోపీ మోలిన్యూక్స్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్షల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఎస్ సజన బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్ రూ.15 లక్షలకు సొంతం చేసుకుంది భార‌త్‌కు చెందిన ప్రియా మిశ్రా బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.15 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన త్రిష పూజిత బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన అపర్ణా మోండల్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ ద‌క్కించుకుంది.  భార‌త్‌కు చెందిన పూనమ్ ఖేమ్నార్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.

భార‌త్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్‌ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన సైమా థాకోర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది . స్కాట్లాండ్‌కు చెందిన కేథరీన్ బ్రైస్ బేస్ ప్రైజ్ అయిన రూ.10లక్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన మన్నత్ కశ్యప్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన అశ్విని కుమారి బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఫాతిమా జాఫర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. భార‌త్‌కు చెందిన కీర్తన బాలకృష్ణన్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన శుభా సతీష్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది .