French Open 2025: ప్రెంచ్‌ ఓపెన్ 2025 ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన క్రీడాకారిణి కోకో గౌఫ్‌(Coco Gauff) విజేతగా నిలిచింది. 7 జూన్ 2025న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి అరీనా సబలెంకా(Aryna Sabalenka)ను ఓడించి ట్రోఫీని ముద్దాడించింది. బెలారసియన్ క్రీడాకారిణిని 6-7(5),6-2, 6-4 స్కోర్‌లతో ఓడించి తన మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించింది. 

Continues below advertisement


రోలాండ్ గారోస్ కోర్టులో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ ఆఖరి వరకు ఉత్కంఠరేపింది. గౌఫ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2023లో యూఎస్ ఓపెన్‌లో కూడా సబలెంకాను ఓడించింది. తర్వాత ఇప్పుడు మరోసారి ఆమెనే ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ కైవశం చేసుకుంది.  


మ్యాచ్ ఎలా జరిగింది. 
ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్ మ్యాచ్‌ రెండు గంటల 38 నిమిషాలు పాటు సాగింది. మొదట సెట్‌లో సబలెంకా దూకుడుగా ఆడింది. మొదట 4-1తో ఆధిక్యంలో సాధించింది. ఆ తర్వాత నుంచి తప్పులు చేయడం మొదలు పెట్టింది. ఆ తప్పులను అవకాశంగా మార్చుకున్న గౌఫ్‌కు స్కోర్‌ను గట్టిగా బదులిచ్చింది. స్కోర్‌ను సమం చేసింది. అయితే మొదటి సెట్‌ టై బ్రకర్‌లో సబలెంకా 7-6తో గెలిచింది. 


రెండో సెట్‌లో సబలెంకా మరిన్ని తప్పులు చేసింది. దీంతో వాటిని సద్వినియోగం చేసుకున్న గౌఫ్‌ స్పీడ్ పెంచింది. ఆ సెట్‌ను 6-2తో కైవశం చేసుకుంది. ఈ సెట్‌ విజయంతో మ్యాచ్‌ను మూడో సెట్‌కు వెళ్లేలా చేసింది. అయినా సరే సబలెంకా తేరుకోలేకపోయింది. తన దూకుడు కొనసాగించిన గౌఫ్‌ 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత సబలెంకా పుంచుకున్నా ప్రయోజనం లేకపోయింది. గౌఫ్ ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. చివరికి ఫ్రెంచ్ ఓపెన్ కొత్త విజేతగా నిలిచింది.  


గాఫ్ అద్భుత ప్రదర్శన 
కోకోగౌఫ్ ఈ మ్యాచ్‌లో గట్టి పోరాటపటిమ చూపించింది. తన వేగం, డిఫెన్స్‌తో సబలెంకా శక్తిమంతమైన షాట్‌లను సమర్థంగా ఎదుర్కొంది. మొదటి సెట్‌లో కొంత ఒత్తిడికి గురైనప్పటికీ రెండో సెట్‌లో మాత్రం బలంగా పైకి లేచింది. గౌప్‌ తన సర్వీస్‌ మెరుగుపరుచుకొని సబలెంకా తప్పులను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ ఫైటింగ్ స్పిరట్టే ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అదించింది. ఇది ఆమె టెన్నిస్ కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. 


గౌఫ్‌ భావోద్వేగం 
విజయం సాధించిన తర్వాత గౌఫ్ భావోద్వేగంతో మాట్లాడింది. తన కుటుంబం, టీం, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. "నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఈ విజయం నాకు ఎంతa ప్రత్యేం" 2022లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఓడిపోయాను. ఆ అనుభవం ఇప్పుడు యూజ్ అయింది" అన్నారు. 


కన్నీళ్లు పెట్టుకున్న సబాలెంకా
సబలెంకా ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి స్ట్రాంగ్‌గానే ఆడింది. కానీ చేసిన తప్పులు ఆమెను వెనక్కి లాగాయి. రెండో, మూడో సెట్‌లో సర్వ్‌లో తప్పులు చేసింది. డబుల్ ఫాల్డ్‌లు చేసింది. ఈ తప్పల వల్ల గౌఫ్‌కు బ్రేక్ పాయింట్‌లు సాధించే ఆవకాశం ఇచ్చింది. సబలెంకా తన శక్తిమంతమైన ఫోర్ హ్యాండ్‌ను ఉపయోగించి పోరాడింది. కానీ అనుకున్న ఫలితాలన్ని సాధించలేకపోయింది. రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఓడిపోయింది . అనంతరం రన్నర్ ట్రోఫీ పట్టుకొని బోరుమని ఏడ్చేసింది. తర్వాత మాట్లాడుతూ "నేను చాలా తప్పులు చేశాను, ఈ ఫైనల్‌ ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టం. గౌఫ్‌కు కృతజ్ఞతలు. నీవు గట్టి పోరాట క్రీడాకారిణివి. నీకు గెలిచే అర్హత ఉంది. "అని   తెలిపింది.