PM Modi 11 years of administration: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా పగ్గాలు చేపట్టి పదకొండు ఏళ్లు అవుతోంది. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ పన్నెండో తేదీకి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా  “వికసిత భారతదేశపు అమృత కాలం – సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం” అని భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం ముందుకు రాష్ట్ర నేతలు క్యాడర్ కు వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 

శ్రీ సత్య సాయి జిల్లా కేంద్ర కార్యాలయంలో బీజేపి ఉపాధ్యక్షుడు  ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   11 సంవత్సరాల ప్రజాహిత పాలనలో దేశం సాధించిన అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవా లక్ష్యాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర పార్టీ ఆదేశానుసారం రాబోయే నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కేంద్రం ,  రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానమంత్రి చేపట్టిన కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. 

అలాగే యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, ప్రచారంలో భాగంగా వీధి సభలు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలనీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులు చేరాలన్నదే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు కంటే భిన్నంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వెనుకబడిన రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

 జన్ ధన్ యోజన, ఉజ్జ్వలా, ఆయుష్మాన్ భారత్, పీఎం అవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా పేదలకు అందుతున్న లాభాలపై ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, సామాజిక న్యాయానికి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి  అన్నారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కార్యక్రమాలు కంటే ఎక్కువగా సత్యసాయి  జిల్లాలో టి కార్యక్రమాలు కార్యకర్తలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి   నరేంద్ర మోదీ  11 సంవత్సరాల ప్రజోపయోగ పాలనకు తరపున జిల్లా ప్రజల అభినందనలు తెలుపుతూ, వికసిత భారత్ కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని ప్రతిజ్ఞ చేశారు.