TDP leader Verma alleges: పిఠాపురంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్ లో ఉంచుతున్నారని.. అదే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించారన్నారు. రోజుకి 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.. పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని ప్రశ్నించారు. ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ముసుగులో ఇంకా వారి పాలనే పిఠాపురంలో సాగుతోందని విమర్శించారు. సహజ సంపదను దోచుకుంటున్నారు .. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందన్నారు. ఇప్పటికీ బొండు ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. పోలీసులు అక్రమ ఇసుక తవ్వకం దారులతో కుమ్మక్కైనట్లు గా కనిపిస్తోందని.. ఇటీవల కూటమి పార్టీలలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులని ఆరోపించారు. ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు.. అక్రమం మట్టి తవ్వకాలకు పవన్ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పవన్ ఆశయాలకు వ్యతిరేకంగా పిఠాపురంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రజలే రోడ్డుకే పరిస్థితి ఉందన్నారు.
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు.. జనసేన పార్టీలో చేరారు. వారే ఈ స్మగ్లింగ్ చేస్తున్నారని వర్మ ఆరోపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పిఠాపురం పోలీసులపై పవన్ కూడా గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎప్పటికప్పడు ఫాలో అవుతారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి.. వాటిని వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియ చేస్తున్నారు. పిఠాపురం సెగ్మెంట్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పుడు వర్మ కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా వర్మ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఆయన పని చేశారు. అయితే ఆయన డామినేట్ చేస్తారన్న ఉద్దేశంతో.. జనసేన శ్రేణులు తరచూ ఆయనను టార్గెట్ చేస్తూంటాయి. ఇప్పుడు ఇసుక, గంజాయి వ్యవహారంపై చేసిన ఆరోపణలుకూడా హైలెట్ అవుతున్నాయి.