వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్ 156 పరగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన బంగ్లా.. అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్గాన్ జట్టుకు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జర్దాన్ శుభారంభం ఇచ్చారు. బంగ్లా పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 62 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ శతకం వైపు దూసుకుపోతున్న గుర్భాజ్‌ను ముస్తాఫిజుర్ అవుట్ చేసి అఫ్గాన్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు.
తర్వాత కూడా అఫ్గాన్ బ్యాటింగ్ సాఫీగానే సాగింది. జర్దాన్‌తో కలిసి రహ్మత్ షా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. కానీ రహ్మత్ షాని అవుట్ చేసి షకీబుల్ హసన్ అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. 18 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీ, 22 పరుగులు చేసిన ఇబ్రహీం జర్దాన్ కూడా అవుటవ్వడంతో అఫ్గాన్ 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 112 పరుగుల వద్దే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లను పెవిలీయన్‌కు పంపారు. అమ్రాతుల్లా ఒమ్రాజాయ్ 22 పరుగులతో వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించాడు. కానీ అతడిని ఇస్లామ్ బౌల్డ్ చేసి బంగ్లాకు ఉపశమనం కలిగించాడు. రషీద్ ఖాన్ 9 పరుగులకు, రహమాన్ 1, నవీన్ ఉల్ హక్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 156 పరుగులకే అఫ్గాన్ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో హసన్ మీరాజ్ 3, షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో రాణించారు. వీరి ధాటికి ఏ ఒక్క అఫ్గాన్ బ్యాటర్ కూడా అర్ధ శతకం సాధించలేదు. ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేదు.
2017 ఐసీసీ ఫుల్ మెంబర్‌షిప్ సాధించిన అఫ్గానిస్థాన్.. వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లో తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతోంది. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ చరిత్రలో 15 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. అయితే తమదైన రోజులో ఎంతటి జట్టునైనా ఇబ్బంది పెట్టగల సత్తా ఆ జట్టుకు ఉంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ను అఫ్గాన్ భయపెట్టింది. స్టార్లతో నిండి ఉన్న జట్లపై చక్కటి పోరాటం కనబర్చింది. ఇప్పుడు ఆ స్థాయి దాటి మరో ముందడుగు వేయాలని చూస్తోంది.
రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, మహమ్మద్ నమీ, హష్మతుల్లా షాహిదిపై అఫ్గాన్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా, నబీ వంటి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. నిలకడలేమి వారికి ప్రధాన ఇబ్బందిగా మారింది. ఈ ఫార్మాట్‌లో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్‌కు పరాజయాలు ఎదురుకాగా.. బంగ్లాదేశ్ గత 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ చిన్న జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే అఫ్గాన్ స్పిన్‌ను బంగ్లా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి