ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(Australian Open)లో సంచలనాలకు తెరపడింది. టాప్‌ సీడ్‌ల నిష్క్రమణతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆరంభంలో సంచలనాలు నమోదయ్యాయి. కానీ టైటిల్‌ గెలిచే దిశగా పయనిస్తున్న స్టార్‌ ఆటగాళ్లు... జూలు విదిల్చడంతో సంచలనాలకు తెరపడింది. పురుషులు, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో స్టార్లంతా సునాయాస విజయాలతో ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. 


వందో మ్యాచ్‌లో జొకో జోరు
ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఇప్పటికే పదిసార్లు కైవసం చేసుకున్న  టాప్‌ సీడ్‌ జొకోవిక్‌... పదకొండో టైటిల్‌ దిశగా సాగుతున్నాడు. రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా ముగిసిన మూడో రౌండ్‌ పోరులో అర్జెంటీనాకు చెందిన థామస్‌ మార్టిన్‌ ఎచెవెరిపై జకోవిచ్‌ సునాయస విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లో ఓడించాడు. అర్జెంటీనాకు చెందిన థామస్‌ మార్టిన్‌ ఎచెవెరితోజరిగిన మూడో రౌండ్‌ పోరులో 6-3, 6-3, 7-6 (7-2) తేడాతో జొకో విజయం సాధించాడు. వరుస సెట్లలో దూకుడుగా ఆడిన జొకో.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగు సెట్లపాటు శ్రమకోర్చిన టాప్‌ సీడ్‌ జొకోవిక్‌ మూడో రౌండ్‌లో మార్నిట్‌ ఎచివెరీపై అలవోకగా నెగ్గాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోకు ఇది వందో మ్యాచ్‌ కాగా అందులో 92 విజయాలు సాధించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జొకో.. తర్వాతి పోరులో బెన్‌ షెల్టన్‌-మన్నారినో మధ్య జరుగుతున్న మూడో రౌండ్‌ పోరులో విజేతతో తలపడనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో వందో మ్యాచ్‌ ఆడటం ద్వారా జొకో.. దిగ్గజ ఆటగాళ్లు రోజర్‌ ఫెదరర్‌, సెరీనా విలియమ్స్‌ సరసన చేరాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెదరర్‌.. 117 మ్యాచ్‌లు ఆడగా సెరీనా విలియమ్స్‌ 105 మ్యాచ్‌లు ఆడింది. మిగిలిన మ్యాచుల్లో రుబ్లేవ్‌, సిన్నర్‌, సిట్సిపాస్‌, డిమినార్‌ విజయం సాధించి నాలుగో రౌండ్‌ చేరారు. 



మహిళల సింగిల్స్‌లో...
మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ సబలెంకా 6-0, 6-0తో సురెంకోపై అవలీల విజయం సాధించింది. ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా విజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. నాలుగో సీడ్‌ కొకొ గాఫ్‌ 6-0, 6-2తో అలీసియాను చిత్తుచేసి నాలుగో రౌండ్‌కు చేరింది. 9వ సీడ్‌ క్రెజికోవా 4-6, 7-5, 6-4తో హంటర్‌పై గెలవగా.. రష్యా సంచలనం, 16 ఏండ్ల మిర్రా ఆండ్రీవా.. 1-6, 6-1, 7-6 (10-5) తేడాతో ఫ్రెంచ్‌ ప్లేయర్‌ డయాన్‌ పారీని ఓడించి నాలుగో రౌండ్‌కు చేరింది. 


మూడోరౌండ్‌కు బోపన్న జోడీ
భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న డబుల్స్‌లో తన జోరు కొనసాగిస్తున్నాడు. బోపన్న, మాథ్యూ ఎబ్డెన్‌  జోడీ 6-2, 6-4తో స్థానిక ద్వయం జాన్‌ మిల్‌మన్‌/ఎడ్వర్డ్‌ వింటర్‌పై విజయంతో మూడోరౌండ్‌లో అడుగుపెట్టింది. భారత్‌కే చెందిన శ్రీరామ్‌ బాలాజీ/విక్టర్‌ వ్లాడ్‌  జంట  రెండోరౌండ్‌ చేరింది. 


ఉక్రెయిన్‌ నో షేక్‌ హ్యాండ్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్న ఉక్రెయిన్‌ టెన్నిస్‌ క్రీడాకారులు ఆట, క్రీడా స్ఫూర్తి కంటే తమకు దేశమే ఎక్కువని చాటిచెబుతున్నారు. రష్యా, బెలారస్‌ క్రీడాకారులతో ఆడే మ్యాచ్‌లలో గెలిచినా ఓడినా మ్యాచ్‌ ముగిశాక వారికి కనీసం హ్యాండ్‌ షేక్‌ ఇవ్వడం లేదు.