Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటికే దీని మీద చాలా చర్చ జరిగింది. ఫాంలోకి ఎప్పుడు వస్తాడో అంతా ఈగర్లీ వెయిటింగ్. పాక్ తో జరగబోయే ఏషియా కప్ మ్యాచ్. చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే అది కోహ్లీకి వందో టీ20 కూడా.
రన్ మెషీన్, కింగ్ కోహ్లీ, మాడర్న్ డే బెస్ట్ ఆల్ ఫార్మాట్ బ్యాటర్..... ఇలా ఎన్నో బిరుదులు, 14 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రికార్డులు. కోహ్లీ ఇప్పటికే ఓ మోడర్న్ డే లెజెండ్. అయినా సరే ఇప్పుడు తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచం మొత్తానికి చాటిచెప్పాల్సిన ఓ అవసరం ఏర్పడింది. తన పర్సనల్ కెరీర్ కు కూడా రాబోయే 2 నెలలు చాలా కీలకం. ఆదివారం పాక్ తో జరగబోయే ఏషియా కప్ మ్యాచ్ ద్వారా కోహ్లీ తన వందో అంతర్జాతీయ టీ20 ఆడబోతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కనీసం వందేసి మ్యాచ్ లు ఆడిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. కానీ కోహ్లీ ఫాంలో ఉన్నప్పుడు కూడా జరగనంత చర్చ.... ఇప్పుడు ప్రపంచమంతా జరుగుతోంది. కోహ్లీ వర్క్ లోడ్ గురించి, పూర్ ఫాం గురించి, మెంటల్ కండిషన్ గురించి..... ఇలా ఎన్నో రకాల విమర్శలు, ట్రోల్స్. వాటన్నింటికీ కోహ్లీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఒక్కసారిగా కోహ్లీ బ్యాడ్ ప్లేయర్ అయిపోతాడా...? కచ్చితంగా కాదు. ఇలాంటి ఫేజ్ ప్రతి ఆటగాడికీ సహజమే. అసలు విరాట్ సృష్టించిన స్టాండర్డ్సే చాలా హై లెవల్. దానికి కాస్త తగ్గినా ఫ్యాన్స్ డిజప్పాయింట్ మెంట్ సహజం.
కోహ్లీ ఫాం గురించి, పాక్ తో మ్యాచ్ గురించి ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు కామెంట్స్ గురించి చెప్పుకుందాం. ఒకటి రవిశాస్త్రి చేశాడు. పాక్ పై కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే చాలు. అందరి నోళ్లూ మూతపడతాయి అని. గన్ షాట్ పాయింట్. దీనితో పెద్దగా విభేదించలేం. పైగా ఇప్పుడు ఇండియా ఆడుతున్న ఫ్రీ స్టైల్, అటాకింగ్ గేం ఆఫ్ క్రికెట్ కూడా కోహ్లీ మీద పెద్దగా ప్రెషర్ లేకుండా చేస్తుంది. ఎందుకంటే మన మిడిలార్డర్ చాలా బలంగా ఉంది కాబట్టి.... కోహ్లీ తన న్యాచురల్ గేం ఆడుతూ పోవచ్చు. ఇక రెండో కామెంట్..... స్వయంగా కోహ్లీ చేశాడు. ఒక్కసారి ఫాంలోకి వస్తే ఎంత నిలకడగా రాణించగలనో తనకు తెలుసంటూ..... నిజమే... అసలు కోహ్లీకి ఒకప్పుడు ఉన్న పేరే... కన్సిస్టెంట్ కోహ్లీ.
పైగా ఈమధ్య నెట్స్ లో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఫుల్ ఫ్లోలో కనిపించాడు. భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీని ప్రకారం ఓ అంచనాకు వచ్చేయలేం కానీ..... ఇప్పటికే చాలా టైం అయింది, ఇకనైనా ఫాంలోకి వచ్చేయ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. పాక్ తో మ్యాచ్, అందులోనూ వందో టీ20.... సరైన లెవల్ లో కంబ్యాక్ ఇవ్వడానికి ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుందంటున్నారు. చూద్దాం మరి... కోహ్లీ క్లీన్ మెంటల్ స్పేస్ తో, తన న్యాచురల్ గేం ఆడుతూనే పాక్ పై ఓ అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడతాడో లేదో.