Ambati Rayudu Retirement, IPL Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది. అయితే ఈ దశలో చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు జరగనున్న ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ కానుందని తెలిపాడు.


ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ మంచి జట్లు అని అంబటి తన ట్వీట్‌లో రాశారు. ‘204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రాత్రికి ఆరో ట్రోఫీని ఆశిస్తున్నాను. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఈ రాత్రి జరిగే ఫైనల్ ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్ అని నిర్ణయించుకున్నాను. ఈ గొప్ప టోర్నమెంట్‌లో ఆడటం నాకు బాగా నచ్చింది. అందరికి ధన్యవాదాలు. ఇంక తిరిగి వచ్చేది లేదు.’ అని పేర్కొన్నాడు.






అంబటి రాయుడు 2010లో ఆడిన IPL సీజన్‌లో అరంగేట్రం చేశాడు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు, ముంబై ఇండియన్స్ జట్టులో కూడా రాయుడు ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. 2018 సీజన్‌లో అంబటి రాయుడు తొలిసారి చెన్నై జట్టులో భాగమయ్యాడు. ఇప్పటి వరకు రాయుడు 203 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 28.29 సగటుతో మొత్తం 4329 పరుగులు చేశాడు. అంబటి రాయుడు గత సీజన్‌లో కూడా హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు.


ఈ సీజన్‌లో ఎలా ఆడాడు?
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంబటి రాయుడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో రాయుడు 11 ఇన్నింగ్స్‌ల్లో 15.44 సగటుతో 139 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 27 పరుగులు మాత్రమే.


ఐపీఎల్ లో  2010  నుంచి ఆడుతున్న  తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు  ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ - 16 లో పెద్దగా ఫీల్డింగ్ చేయకపోయినా  చెన్నై  అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించుకుంటున్నది.  అయినా కూడా  రాయుడు..  ఈ సీజన్  లో  12 మ్యాచ్ లలో 10 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  15.25 సగటు, 127.08 స్ట్రైక్ రేట్ తో  122 పరుగులే చేసి విమర్శల పాలవుతున్నాడు. 


ఒకప్పుడు  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌కు రాయుడు వెన్నెముకగా వ్యవహరించేవాడు.  2018 సీజన్ లో   రాయుడు 16 మ్యాచ్ లలో  ఏకంగా  602  పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతడు ఓ సెంచరీ కూడా చేశాడు.  2018లో సీఎస్కే ట్రోఫీ నెగ్గడంలో రాయుడుది కీలక పాత్ర. ఆ తర్వాతి సీజన్ లో రాణించకపోయినా  2020లో  359 పరుగులు చేసి  ఫర్వాలేదనిపించాడు.  కానీ గడిచిన రెండు సీజన్లలో  రాయుడు బ్యాటింగ్ లో  మునపటి దూకుడు లేదని చెప్పక తప్పదు.